E-Paper
Advertisement

CM Chandrababu: ఏపీకి అప్పులు ఇచ్చే దిక్కు లేదు.. సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఏపీకి అప్పులు ఇచ్చే దిక్కు లేదు.. సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu: గత వైసీపీ పాలనపై మరోమారు సీఎం చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ ఉందని, గత ప్రభుత్వానికి క్రమశిక్షణ అనే మాటే తెలియదంటూ చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లాలో శనివారం పర్యటించిన సీఎం చంద్రబాబు.. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రసంగించారు.

చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో మార్చి ఒకటో తేదీని పురస్కరించుకుని ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానికంగా పెన్షన్ లబ్దిదారుడైన కల్లుగీత కార్మికుని ఇంటి వద్దకు వెళ్లిన చంద్రబాబు, కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన ఇద్దరు మనవరాళ్ల గురించి ఆ కుటుంబ సభ్యులు తెలిపి ఆదుకోవాలని కోరగా.. ఒకొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసేలా సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

అంతేకాకుండా మిషన్ వాత్సల్య పథకం కింద ఒకొక్కరికి ప్రతినెల రూ. 4000 చొప్పున ఇద్దరు ఆడపిల్లలకు మొత్తం రూ. 8000 లను 18 సంవత్సరాలు నిండే వరకు అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. తమ ఇంటికి వచ్చిన సీఎం పెన్షన్ అందించడమే కాక, తమకు ఆర్థిక భరోసా కల్పించడంపై కల్లుగీత కార్మికుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ.. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మరో మారు సభలో ప్రస్తావించారు. ప్రతినెలా ఒకటో తేదీనే తాము పెన్షన్లను అందజేస్తున్నామని, ఈ ఏడాది మూడు లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ ఒకవైపు అప్పుల పై వడ్డీ చెల్లిస్తూనే రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కొనసాగించే పరిస్థితి ప్రస్తుతం ఉందన్నారు. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లను పంపిణీ చేసిన ఘనత ఏ రాష్ట్రానికి లేదన్నారు.

Advertisement

గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్లను రూ. 3000 చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 4000 పెంచామన్నారు. దివ్యాంగుల పెన్షన్ ను రెట్టింపు చేసి వారికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. గడిచిన ఐదేళ్లు ప్రజలు అనేక బాధలు పడ్డారని, అందుకే కూటమికి ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారన్నారు. తమ ప్రభుత్వం అప్పు కోసం ప్రయత్నిస్తే రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా ప్రస్తుతం లేదన్నారు. మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టా రీతిన ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా పాలన సాగించారని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మారిందన్నారు.

Also Read: Posani Health issue: పోసానికి సీరియస్.. జైలు అధికారులు ఏం చేశారంటే?

ఏపీ బడ్జెట్ లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని, ప్రజా సంక్షేమం కోసం కూటమి పాటుపడుతుందన్నారు. కేంద్రం ఇస్తున్న సహకారంతో రాష్ట్రం మరింతగా అభివృద్ది పథంలో నడుస్తుందన్నారు. రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు రానున్నాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. అలాగే యువతకు నైపుణ్యత పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, త్వరలో తల్లికి వందనం, ఆత్మీయ రైతు భరోసా వంటి పథకాలను అమలు చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు తమ కాలనీకి రావడంతో ఆయనతో మాట్లాడేందుకు కాలనీ వాసులు పోటీపడ్డారు. ఆ తర్వాత స్థానిక సమస్యలను సీఎం అడిగి తెలుసుకొని, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సీఎం రాక సంధర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×