E-Paper
Advertisement

CM Chandrababu: అప్పు అడిగితే.. పారిపోతున్నారు.. సీఎం చంద్రబాబు

CM Chandrababu: అప్పు అడిగితే.. పారిపోతున్నారు.. సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu: వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం అనారోగ్యమైందని సీఎం చంద్రబాబు అన్నారు. నీతి అయోగ్ నివేదికపై సీఎం చంద్రబాబు సోమవారం మాట్లాడారు. ఈ సంధర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మీడియా ముందుంచారు. ఐదేళ్ల పాలనతో రాష్ట్రం నేడు ఎంతగానో కోల్పోయిందని సీఎం అన్నారు.

తాడేపల్లిలోని సచివాలయంలో సీఎం మాట్లాడుతూ.. నీతి అయోగ్ నివేదికలో రాష్ట్రానికి 17వ ర్యాంక్ వచ్చినట్లు సీఎం తెలిపారు. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో ఏపీ చివరి స్థానంలో ఉందని, వృద్ది రేటు దారుణ పరిస్థితికి చేరిందన్నారు. నీతి అయోగ్ నివేదికలో ఏపీ పరిస్థితి మరింతగా దిగజారిందన్నారు. ఏపీలో వైసీపీ పాలన ఆర్థిక కష్టాలు మిగిల్చిందని, మొత్తం డబ్బులను ఏం చేశారో అర్థం కావడం లేదన్నారు. అన్ని ఆస్తులను తాకట్టు పెట్టారని, చివరకు ఎమ్మార్వో ఆఫీసులను కూడ తాకట్టు పెట్టినట్లు సీఎం అన్నారు.

Advertisement

శరీరానికి ఆరోగ్యం ఎలా అవసరమో, అలాగే ఒక రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి మెరుగు అవసరమన్నారు. రాష్ట్రం నాశనమైందని చెప్పేందుకు నీతి అయోగ్ రిపోర్ట్ నిదర్శనమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి గల సమస్యలు చాలానే ఉన్నాయని, వాటిని పరిష్కరించకుండ గత ప్రభుత్వం ఏం చేసిందో అర్థం కావడం లేదన్నారు. ఏదైనా రాష్ట్రం ఎలా ఉందో తెలుసుకొనేందుకు, ఆర్థిక పరిస్థితిని బట్టి చెప్పవచ్చన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే సంపద సృష్టించాల్సిన అవసరం ఉందని, అలాగే ఓ వైపు జీతాలు చెల్లిస్తూ అభివృద్ది పథంలో నడిపించాల్సిన భాద్యత తమపై ఉందని చంద్రబాబు అన్నారు.

బాగున్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని, ఇప్పుడు మన రాష్ట్రానికి అప్పులు ఇచ్చే పరిస్థితి కూడ ఇప్పుడు లేదన్నారు. జిఎన్డీపి 33 పెరిగిందని, అప్పులు తెస్తే, మళ్లీ చెల్లించే సత్తా ఏపీకి లేదన్నారు. రాష్ట్రానికి రాజధాని లేదని, అలాగే పోలవరం కూడ పూర్తి చేయలేదని, మరి వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర వృద్ది రేటు పూర్తిగా పడిపోయిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే బాధేస్తుందని అన్నారు.

Advertisement

రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు, అలాగే మహిళలకు దీపం పథకం 2.o ద్వార ఏడాదికి ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామన్నారు. అంతేకాకుండ దేశంలో ఎక్కడ లేని విధంగా పింఛన్ నగదును పెంచామని, ప్రతి నెలా ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నట్లు సీఎం అన్నారు. వైసీపీ చేసిన అప్పుల పుణ్యమా అంటూ మళ్లీ అప్పు తెచ్చే పరిస్థితి లేదన్నారు.

Also Read: Ayyannapatrudu on Nara Lokesh: లోకేష్ కు డిప్యూటీ.. అయ్యన్న లాజిక్ రిప్లై ఇదే!

అన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని, త్వరలో మెగా డీఎస్సీ కూడ నిర్వహిస్తున్నట్లు సీఎం పునరుద్ఘాటించారు. త్వరలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, 10 లక్షల కోట్లు పెట్టుబడులతో రాష్ట్రంలోని యువతకు ఉపాధి కలుగుతుందన్నారు. తాను ఊహించని రీతిలో రాష్ట్రానికి డ్యామేజ్ చేసిన ఘనత మాజీ సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. జీవోలు కూడ బయటకు రాకుండ పాలన చేశారని, ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చాక, లెక్కలు చూసి షాక్ కు గురైనట్లు సీఎం అన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×