E-Paper
Advertisement

Visakhapatnam: ఇండియాలో సేఫ్-క్లీన్ సిటీ, మహిళల భద్రతలో విశాఖ టాప్ ప్లేస్-సీఎం చంద్రబాబు

Visakhapatnam: ఇండియాలో సేఫ్-క్లీన్ సిటీ, మహిళల భద్రతలో విశాఖ టాప్ ప్లేస్-సీఎం చంద్రబాబు
Advertisement

Visakhapatnam: ఇండియాలోనే సేఫ్ అండ్ క్లీన్ సిటీ విశాఖపట్నం అని అన్నారు సీఎం చంద్రబాబు. మహిళల భద్రత విషయంలో ఈ నగరం అగ్రస్థానంలో ఉందన్నారు. రానున్న మూడు నాలుగేళ్లు గుగూల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని వివరించారు. గురువారం విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో ఇండియా-యూరప్ బిజినెస్ భేటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు.

మహిళల భద్రతలో విశాఖ టాప్ ప్లేస్ 

Advertisement

ఇండియా-ఐరోపా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని అన్నారు. రూ. 50 వేల కోట్ల పెట్టుబడితో విశాఖలో ఓ గిగావాట్ డేటా సెంటర్‌ను గూగుల్ ఏర్పాటు చేయనుందన్నారు. సాంకేతిక రంగంలో తాము కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపారు.

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఐటీలో భారతీయులదే కీలకపాత్ర అని చెప్పుకొచ్చారు. డేటా సెంటర్, స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల వంటి రంగాల్లో ముందున్నామని వెల్లడించారు. త్వరలో అమరావతితో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ అందుబాటులోకి రానుందని ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

ఇండియా-యూరప్ బిజినెస్ భేటీలో సీఎం చంద్రబాబు

పెట్టుబడులతో వచ్చేవారిని ఎలాంటి ఇబ్బందులు కావాల్సిన మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. మౌలిక సదుపాయాల కల్పనలో తమ రాష్ట్రం ముందు ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ విభాగంలో పెట్టుబడులు వస్తున్నాయని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో పోర్టులతోపాటు రైల్వే అనుసంధానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

ALSO READ: ఏపీలో భారీ పెట్టుబడి.. గూగుల్ తర్వాత ఆ సంస్థదే

గ్రీన్‌ ఎనర్జీ సెక్టార్‌లో భారత్‌ 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందుకు అనుగుణంగా 160 గిగావాట్ల విద్యుదుత్పత్తికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా సౌర-పవన-పంప్డ్‌ ఎనర్జీ రంగాల్లో బలంగా ఉన్నామని, ఏపీలో వివిధ రకాల పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేశారు. ఏపీలో నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉందని, కొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు చేయడంతో వారు ముందు ఉంటారని అన్నారు. పెట్టుబడి పెడితే అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదన్నారు. కేవలం 45 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×