E-Paper
Advertisement

CM Chandrababu: 75 ఏళ్లలో కూడా తగ్గని బాబు ఎనర్జీ.. సైకిల్ ఎంత స్పీడ్‌గా తొక్కారో చూడండి..

CM Chandrababu: 75 ఏళ్లలో కూడా తగ్గని బాబు ఎనర్జీ.. సైకిల్ ఎంత స్పీడ్‌గా తొక్కారో చూడండి..
Advertisement

CM Chandrababu: దేశంలో అత్యంత అనుభవం కలిగిన రాజకీయ నాయకుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరు. నాలుగు సార్లు సీఎం అయిన ఘనత ఆయన సొంతం. అయితే సాధారణంగా 50 ఏళ్లు దాటితేనే ఇక అంతా అయిపోయిందని చాలా మంది భావిస్తుంటారు. 60 ఏళ్లకు అడుగుపెట్టేసరికి షుగర్, బీపీ, నడుము – కాళ్లు నొప్పులు చుట్టుముట్టేస్తుంటాయి. అలాంటిది 75 ఏళ్ల వయసులోనూ ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ చంద్రబాబు ఒక యువకుడిలా కష్టపడుతున్నారు. తాజాగా కుప్పం పర్యటన సందర్భంగా చిన్నపిల్లాడిగా మారిపోయి ఎంతో ఉత్సాహంగా సైకిల్ తొక్కి ఆశ్చర్యంలో ముంచెత్తారు.

గిన్నీస్ రికార్డు బద్దలు..

సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం (Kuppam)లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు ఒకేసారి 5,555 ఈ సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా గిన్నీస్ రికార్డు సృష్టించారు. కుప్పం నియోజకవర్గాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే శివపురం నుంచి ప్రజావేదిక వరకూ దాదాపు 3 కిలోమీటర్ల పాటు చంద్రబాబు ఈ – సైకిల్ తొక్కడం విశేషం. చంద్రబాబు ముందుకు సాగుతుండగా ఆయన వెంట వందలాది మంది సైకిళ్లు, కార్లలో అనుసరించడం గమనార్హం. అయితే చంద్రబాబు సైకిల్ స్పీడ్ ను అందుకునేందుకు ఆయన సెక్యూరిటీ టీమ్ మరింత వేగంగా పరిగెత్తాల్సి రావడాన్ని వీడియోలో చూడవచ్చు.

Advertisement

Also Read: Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

ఫించన్లు పంపిణీ చేసిన చంద్రబాబు

కుప్పం రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో సైతం పాల్గొన్నారు. బెగ్గిపల్లెలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మునెమ్మ అనే వృద్ధురాలికి వృద్ధాప్య పింఛను, చిన్నతాయమ్మ అనే మహిళకు వితంతు పింఛను, వెంకటరామప్పకు వృద్ధాప్య పింఛను అందించారు. అనంతరం లబ్దిదారులు, వారి కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫొటోలు దిగారు.

Advertisement

Also Read: Ambati Rambabu: అంబటి బండ బూతులు.. ఏకంగా చంద్రబాబునే, ఫైర్ అవుతోన్న తమ్ముళ్లు

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×