E-Paper
Advertisement

CM Chandrbabu on Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజీనామాపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే

CM Chandrbabu on Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజీనామాపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే
Advertisement

CM Chandrbabu on Vijayasai Reddy:  ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారిగా విజయసాయిరెడ్డి రాజీనామా పై స్పందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు, తన ఎంపీ పదవికి కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారగా, వైసీపీ క్యాడర్ నివ్వెర పోయిందని చెప్పవచ్చు. అయితే ఇదే అంశంపై సీఎం చంద్రబాబు శనివారం మాట్లాడారు.

విజయసాయిరెడ్డి తన రాజీనామా ప్రకటనలో సీఎం చంద్రబాబుకు తనకు రాజకీయంగా మాత్రమే విభేదాలు ఉన్నాయని, వ్యక్తిగతంగా విభేదాలు లేవంటూ పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సైతం చిరకాల స్నేహం ఉన్నట్టు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీతో కేవలం రాజకీయంగా మాత్రమే విభేధించానని, వ్యక్తిగత వైరాలు లేవన్నారు. ఈ కామెంట్స్ పై సీఎం చంద్రబాబు స్పందించారు.

Advertisement

Also Read: RK Roja: రోజాపై టీడీపీ ఎమ్మేల్యే జబర్దస్త్ పంచులు.. ఏకంగా అలా అనేశారేంటి?

సీఎం మాట్లాడుతూ.. సహజంగా రాజకీయ నేతలకు తామున్న పార్టీపై నమ్మకం లేనప్పుడే ఇంకొక పార్టీకి వెళ్లడం జరుగుతుందన్నారు. కానీ నిన్నటి వరకు వైసీపీలో కొనసాగిన విజయసాయిరెడ్డి, పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకొని పార్టీకి దూరమయ్యారన్నారు. అలాగే ఈ అంశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినదిగా అభివర్ణించిన సీఎం చంద్రబాబు, ఇంతకంటే స్పందించడం మంచిది కాదంటూ మాట్లాడారు. మొత్తం మీద రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని గ్రహించే, విజయ సాయి రెడ్డి రాజీనామా చేసినట్లు చంద్రబాబు చెప్పకనే చెప్పారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×