E-Paper
Advertisement

Chandrababu Naidu కుప్పాన్ని ప్రయోగశాలగా మారుస్తాం.. అగస్త్య అకాడమీలో విద్యార్థులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం! 

Chandrababu Naidu కుప్పాన్ని ప్రయోగశాలగా మారుస్తాం.. అగస్త్య అకాడమీలో విద్యార్థులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం! 
Advertisement

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు చేరుకున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలంలోని శాస్త్రీయ శిక్షణా కేంద్రంగా గుర్తింపు పొందిన అగస్త్య విద్యాచల్ అకాడమీలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దాదాపు రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన టీచర్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం, అనంతరం రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న లెర్నర్స్ అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్, రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఒబెరాయ్ విజిటర్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ శిక్షణా కేంద్రాలు ఏటా వేలాది మంది ఉపాధ్యాయులకు, విద్యార్థులకు దిశానిర్దేశం చేయనున్నాయి.

ఈ సందర్భంగా అకాడమీలోని విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. విద్యార్థులు వినూత్నంగా ఆలోచించినప్పుడే సమాజంలో గొప్ప మార్పులు సాధ్యమవుతాయని, ఇన్నోవేషన్లే భవిష్యత్తుకు పునాది అని ఆయన పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలకు, స్టార్టప్ కంపెనీలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను యువత అందిపుచ్చుకోవాలని, ఐటీ రంగంలో తెలుగు వారు రాణించినట్లే ఏఐ (AI), డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాల్లోనూ ముందుండాలని ఆకాంక్షించారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రకాల ఆధునిక సాంకేతికతలకు ప్రయోగశాలగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Advertisement

కుప్పం ప్రాంత అభివృద్ధి, నీటి భద్రతపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా కుప్పంకు కృష్ణా జలాలను తీసుకురావడం ద్వారా దశాబ్దాల కల నెరవేరిందని, ఈ సందర్భంగా ఆయన నీటి వద్ద హారతి ఇచ్చారు. నీటి సంరక్షణ మరియు సద్వినియోగం విషయంలో అగస్త్య అకాడమీ ప్రతినిధులు వినూత్నంగా ఆలోచించాలని, కుప్పంలోనే దీనిపై ఒక పైలెట్ ప్రాజెక్టును చేపడదామని పిలుపునిచ్చారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా విద్యుత్ ఛార్జీలను తగ్గించడం సాధ్యమైందని, రాబోయే రోజుల్లో ఏపీని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also: Khammam: ఖమ్మం జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 32 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×