E-Paper
Advertisement

Mega Parents-Teachers Meeting: ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు.. పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు

Mega Parents-Teachers Meeting: ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు.. పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో  సీఎం చంద్రబాబు
Advertisement

Mega Parents-Teachers Meeting: ప్రజలను ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతోందన్నారు. భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం భారత్ అవుతుందన్నారు. పిల్లలకు తెలివితేటలు బాగా ఉన్నాయని, అన్ని సబ్జెక్టుల్లో బేసిక్ పట్టు సాధించేలా బలమై పునాది వేసే కార్యక్రమం ఇదేనని అన్నారు.

పార్వతీపురం జిల్లాలో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

Advertisement

పిల్లల బలహీనతలు, బలాలు గుర్తించాలన్నారు. వినూత్న కార్యక్రమాలకు పిల్లలు ఎప్పుడూ ముందు ఉండాలన్నారు. పిల్లల ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలని, లోపం ఎక్కడుందో గమనించి వెంటనే సరిచేయాలన్నారు. చదువుతోపాటు ఆటలు, పాటలు కూడా ఉండాలన్నారు. తక్కువ సమయమైనా పిల్లలు ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

నూతన బోధన విధానాలు తయారీ, టీచర్ల పనితీరును అభినందించారు సీఎం.  పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్. మెగా పేరెంట్‌-టీచర్స్‌ సమావేశం శుక్రవారం ఉదయం భామినిలోని మోడల్ పాఠశాలలో జరిగింది. దీనికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. తరగతి గదులను పరిశీలించారు ముఖ్యమంత్రి.

Advertisement

చదువుతోపాటు ఆటలు ఉండాలి-సీఎం

శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 45 వేల ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో మెగా పీటీఎం కార్యక్రమం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని భామిని మోడల్‌ స్కూల్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ హాజరయ్యారు.

పాఠశాలకు వెళ్లిన సీఎం చంద్రబాబు, నేరుగా విద్యార్థుల తరగతులను పరిశీలించారు.  విద్యార్థులతోపాటు క్లాస్ రూములో కాసేపు కూర్చొన్నారు. డిజిటల్ పాఠాలు ఉపాధ్యాయులు ఏ విధంగా బోధన చేస్తున్నారనేది దగ్గరుండి  తెలుసుకున్నారు.  ఆ తర్వాత విద్యార్థులతో కూర్చుని వారితో ముచ్చటించారు.  వారి ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు.

ALSO READ: హిడ్మా ఎన్‌కౌంటర్‌పై రచ్చ.. మారేడుమిల్లిలో ఓయూ విద్యార్థులు అరెస్ట్

ట్యాబ్ ఓపెన్ చేసి పిల్లలు తెలుగు చదివే విధానాన్ని దగ్గరుండి పరిశీలించారు.  విద్యార్థులు-పేరెంట్స్‌తో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని శారద జెడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం సమావేశానికి హాజరయ్యారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×