E-Paper
Advertisement

Davos-2026: ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. అమరావతిలో ఏఐ వర్సిటీపై చర్చ

Davos-2026: ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. అమరావతిలో ఏఐ వర్సిటీపై చర్చ
Advertisement

Davos-2026:  దావోస్ వేదికగా భారీ ఎత్తున పెట్టుబడులు రప్పించేందుకు చంద్రబాబు టీమ్ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ ఇనిషియేటివ్స్ ఉపాధ్యక్షురాలు కాలిస్టాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఇరువురు మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. అంతేకాదు అమరావతిలో ఏఐ యూనివర్సిటీ గురించి చర్చ జరిగింది.

దావోస్ బిజీగా సీఎం చంద్రబాబు, పలు పారిశ్రామిక‌వేత్తలతో భేటీ

Advertisement

ఏపీకి కేవలం పెట్టుబడులు మాత్రమే కాకుండా టెక్నాలజీ, విద్యపరంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో బుధవారం దావోస్ వేదికగా ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ ఇనిషియేటివ్స్ ఉపాధ్యక్షురాలు కాలిస్టా రెడ్మెండ్ తో ఆయన సమావేశమయ్యారు. ఇరువురు కీలక అంశాలపై చర్చించారు.

ఏపీలో స్టార్టప్‌లను ప్రోత్సహించడంతోపాటు యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను అందించేందుకు సిద్ధమైంది ఆ సంస్థ. ఏఐ ఎకో సిస్టమ్‌ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు కాలిస్టా. దేశంలోనే అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చ జరిగింది. ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని అనేదానిపై మాట్లాడారు.

Advertisement

ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్‌తో ముఖ్యమంత్రి సమావేశం

దీనిపై ఇప్పటికే ఓ అవగాహన ఒప్పందంపై సంతకం కూడా చేశారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్, హార్డ్ వేర్ తయారీ యూనిట్ ఏర్పాటు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో భాగస్వామ్యం వహించేందుకు ఎన్విడియా ఆసక్తి చూపింది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న కంపెనీల్లో ఎన్విడియా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

2026 ఏడాది నాటికి ఈ కంపెనీ విలువ 6 ట్రిలియన్లకు చేరుకుంటుందని టెక్ నిపుణుల అంచనా. ప్రపంచంలోని టెక్ కంపెనీలు ఏఐ చిప్స్ కోసం ఎన్విడియా వైపు చూస్తున్నాయి. అలాంటి కంపెనీని ఆంధ్రప్రదేశ్‌కు రప్పిస్తే కేవలం విద్యకు మాత్రమే కాకుండా దాని ఆధారిత కంపెనీల రాక మరింత వేగవంతం అవుతుందని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది.

ALSO READ: దావోస్‌లో ఏపీ ఆరంభం అదుర్స్.. RMZ గ్రూప్ భారీపెట్టుబడి, ఫలించిన లోకేష్ కృషి

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×