E-Paper
Advertisement

Chandrababu meets PM Modi: ప్రధాని మోదీతో ఏపీ సీఎం కీలక భేటీ.. సమావేశం అనంతరం చంద్రబాబు..

Chandrababu meets PM Modi: ప్రధాని మోదీతో ఏపీ సీఎం కీలక భేటీ.. సమావేశం అనంతరం చంద్రబాబు..
Advertisement

CM Chandrababu meets PM Modi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి మోదీతో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో రూ. 15 వేల కోట్ల ఆర్థిక సాయం చేస్తామంటూ ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నిధుల విడుదలపైనా చంద్రబాబు వాకబు చేసినట్లు సమాచారం.

Also Read: దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో ఊహించని ట్విస్ట్.. అందరం కలిసి ఉందామని వాణి ప్రతిపాదన

Advertisement

అదేవిధంగా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యే ఖర్చు తామే భరిస్తామంటూ కూడా కేంద్రం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన నిధులపై కూడా ఆయన ప్రధానితో చర్చించినట్లుగా తెలుస్తోంది. వీటితోపాటు వెనకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థిక సాయం కింద నిధులు విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కోరినట్లు సమాచారం. ఈ అంశాలతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ సమావేశంలో తాను ప్రతిపాదించిన అంశాలపై ప్రధాని సానుకూలంగా స్పందిచారని, ఈ నేపథ్యంలో చంద్రబాబు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×