E-Paper
Advertisement

Amaravati: సీఎం చంద్రబాబు-జగన్ ఫ్యామిలీల దీపావళి సంబరాలు, మేటరేంటి?

Amaravati: సీఎం చంద్రబాబు-జగన్ ఫ్యామిలీల దీపావళి సంబరాలు, మేటరేంటి?
Advertisement

Amaravati: నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే ఏపీ రాజకీయ నేతలు దీపావళి వేళ కాస్త రిలాక్స్ అయ్యారు. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌ సోమవారం రాత్రి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇద్దరు నేతలు వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

ఘనంగా దీపావళి సంబరాలు

Advertisement

ఏపీ రాజకీయాల్లో వారిద్దరు కీలకమైన నేతలు. ఒకరు సీఎం చంద్రబాబు కాగా, మరొకరు మాజీ సీఎం జగన్. సోమవారం రాత్రి ఇరు కుటుంబాలు వేర్వేరు ప్రాంతాల్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసంలో భార్య భువనేశ్వరితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

సీఎం దంపతులు బాణాసంచా కాల్చిన ఫొటోలను టీడీపీ అధికారికంగా విడుదల చేసింది. చంద్రబాబు, భువనేశ్వరి పక్క పక్కనే నిలబడి చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు వెలిగిస్తూ కనిపించారు.అటు వైసీపీ అధినేత జగన్ బెంగళూరులోని యలహంక నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. సోమవారం ఉదయం లండన్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు.

Advertisement

సీఎం చంద్రబాబు.. జగన్ దంపతులతో కలిసి

దీపావళి వేడుకల్లో భార్య భారతితో కలిసి పాల్గొన్నారు మాజీ సీఎం. దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చారు మాజీ సీఎం జగన్ దంపతులు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎక్స్‌ ద్వారా తెలియజేశారు మాజీ సీఎం జగన్.

ALSO READ:  నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..  ఏడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

ఇదిలా ఉండగా జగన్ సడన్‌గా లండన్ నుంచి రావడంపై పార్టీ నేతలు అప్పుడు చర్చించుకోవడం మొదలుపెట్టారు.  షెడ్యూల్ ప్రకారం ఈనెల 23 వరకు జగన్ దంపతులు లండన్‌లో గడపాల్సి ఉంది.  రెండురోజులు ముందుగానే వచ్చేశారని అంటున్నారు. రీసెంట్‌గా జగన్ తన ఫోన్ నెంబర్లు ఇవ్వలేదని సీబీఐ.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో అధినేత వచ్చారని అంటున్నారు కొందరు నేతలు. జగన్ విదేశీ పర్యటన పూర్తి కావడంతో నేరుగా ఇప్పుడు న్యాయస్థానం ముందు హాజరుకావాల్సివుంది.  మరి ఇప్పుడైనా న్యాయస్థానం ముందు హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×