E-Paper
Advertisement

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై లోతైన చర్చ జరిగింది. సమావేశంలో పాల్గొన్న మంత్రులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహంగా ఉన్నట్టు. వారికి కొన్ని కఠినమైన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

సమావేశంలో ప్రధానంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా.. సీఎం చంద్రబాబు నాయుడు ఇన్‌ఛార్జ్ మంత్రులకు కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఏ ఎమ్మెల్యే అయినా తప్పు చేస్తే, వారిని సరిదిద్దే పూర్తి బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని మంత్రులను సీఎం ఆదేశించారు.

Advertisement

ఈ ముఖ్యమైన అంశాన్ని మొదట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేవనెత్తినట్లు సమాచారం. కూటమి ఎమ్మెల్యేల్లో ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా లేదా నిర్దేశించిన పనితీరును పాటించకపోయినా.. వారిపై ఇన్‌ఛార్జ్ మంత్రులు కఠినంగా వ్యవహరించాలని.. తదనుగుణంగా ఆదేశాలు జారీ చేయాలని ఆయన సీఎం చంద్రబాబును కోరారు.

పవన్ కల్యాణ్ చేసిన సూచనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కూటమి ఎమ్మెల్యేల బాధ్యతలను మంత్రులే పూర్తిగా తీసుకుంటారని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ విషయంపై రాబోయే కేబినెట్ సమావేశంలో సమగ్ర సమీక్ష నిర్వహించి, తదుపరి చర్యలను నిర్ధారిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేల పనితీరులో లోపాలుంటే సహించేది లేదన్న సంకేతాలను ఈ సమావేశం ద్వారా సీఎం స్పష్టంగా పంపారు.

Advertisement

ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చ జరిగినప్పటికీ, అధిక దృష్టి ఎమ్మెల్యేల క్రమశిక్షణ, వారి పనితీరు మెరుగుదలపైనే కేంద్రీకృతమైనట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇన్‌ఛార్జ్ మంత్రులు తమ తమ జిల్లాల్లోని ఎమ్మెల్యేలపై మరింత పర్యవేక్షణ పెంచే అవకాశం ఉంది.

కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, కనీస క్రమశిక్షణ పాటించాలని ఈ సమావేశం గట్టి సందేశాన్ని పంపింది. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం మంత్రులకు ఇవ్వడం ద్వారా.. పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×