// // Women employees work from home: ఆడవారికి ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఇక ఫ్రీగా ఇంటి నుంచే పని.. -->
E-Paper
Advertisement

Women employees work from home: ఆడవారికి ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఇక ఫ్రీగా ఇంటి నుంచే పని..

Women employees work from home: ఆడవారికి ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఇక ఫ్రీగా ఇంటి నుంచే పని..
Advertisement

Women employees work from home: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ జాబ్‌ను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఇంటి నుంచి పని చేయడం సౌలభ్యంగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంట్లో నుంచి పని చేయడం వల్ల శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరిగే అవకాశం ఉంటుందని ట్విట్టర్ వేదికగా సీఎం వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అంతర్జాతీయ సైన్స్ లో మహిళలు, బాలికల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రోజురోజుకీ అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఇంటి నుండి పని చేసే సంస్కృతి పెరిగిందన్నారు. సైన్స్ రంగంలో విజయం సాధిస్తున్న మహిళలను సీఎం ప్రశంసించారు. ప్రభుత్వం ఇంటి నుంచి పని చేయడాన్ని పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ లాంటి రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు అందించడానికి ఏపీ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి అనంతరం వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాముఖ్యత అందిరకీ తెలిసిందని ఆయన తెలిపారు. అన్ని రంగాలలో మహిళలకు సమానమైన అవకాశాలు స్పష్టించడానికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Advertisement

ముఖ్యంగా మహిళల సౌలభ్యం కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రారంభించడానికి పెద్ద ఎత్తున్న తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రిమోట్ వర్కింగ్, కో- వర్కింగ్ స్పేస్, ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకునే సౌలభ్యం ఉంటుందని అన్నారు. ఇవి కంపెనీలకు, ఉద్యోగులకు, వ్యాపార వేత్తలకు మంచి ఫలితాలు అందజేస్తాయని ఆయన తెలిపారు. మెరుగైన పని చేయడంతో పాటు వర్క్ లో మంచి ఔట్ పుట్ వచ్చే ఛాన్స్  ఉంటుంది.. కాబట్టి వర్క్ ఫ్ర హోమ్ ఉద్యోగాలు మహిళలకు ఎంతో ఉపయోగకరమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యం అత్యవసర సర్వీసులైన రెవెన్యూ , పోలీసు, హాస్పిటల్, టీచర్లు విభాగాలు తప్పించి మిగిలిన విభాగాల్లో ఆఫీసుకు వచ్చే అవసరం ఉండదు.  ఇలాంటి ఉద్యోగాలకు ఇంటి నుంచే పని కల్పించే యోచనలో ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మహిళలు ఆఫీస్ లో ఉద్యోగం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో అలసిపోతున్నారు.  ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ కరెక్ట్ గా ఉంటుందని సీఎం అన్నారు.

Also Read: SC on Freebies: ఎన్నికల్లో ఉచితాలు ప్రకటించడంపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు..

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో మహిళ ఉద్యోగుల పాలిట ఇది అర్థవంతమైన మార్పుకు ఇది శ్రీకారం చుట్టబోతుందని సీఎం తెలిపారు. ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 ఒక గేమ్ ఛేంజింగ్ పాలసీ అని చెప్పారు. ఏపీలో పత్రి నగరం, పట్టణం, మండలంలో సాఫ్ట్ వేర్ ఆఫీసులు పెట్టడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం చేయడం ల్ల మహిళలకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×