E-Paper
Advertisement

CM Chandrababu: ఏపీలో ప్రతిభకు కొరత లేదు,మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్‌గా వైజాగ్- సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఏపీలో ప్రతిభకు కొరత లేదు,మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్‌గా వైజాగ్- సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu : ఏపీ సీఎం నారా చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వైజాగ్ ఐటీ హబ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో కాగ్నిజెంట్ సంస్థ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్‌తో పాటు.. సత్వా సంస్థతో సహా మరో ఏడు ప్రముఖ ఐటీ కంపెనీలకు కూడా ఈ సందర్భంగా భూమిపూజ నిర్వహించారు.

రూ. 1,583 కోట్లతో కాగ్నిజెంట్ మెగా ప్రాజెక్ట్:
రాష్ట్ర ప్రభుత్వం కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో కాగ్నిజెంట్ సంస్థకు 21.31 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో కాగ్నిజెంట్ తన ఐటీ క్యాంపస్‌ను మూడు దశల్లో.. మొత్తం రూ. 1,583 కోట్లు భారీ వ్యయంతో నిర్మించనుంది. ఈ క్యాంపస్ నిర్మాణం విశాఖ ఐటీ రంగంలో పెను మార్పు తీసుకురానుంది. మరోవైపు.. కాగ్నిజెంట్ తన తాత్కాలిక క్యాంపస్‌లోనూ కార్యకలాపాలను త్వరలో ప్రారంభించనుంది. వెయ్యి సీటింగ్ సామర్థ్యం ఉన్న ఈ తాత్కాలిక క్యాంపస్ శనివారం(డిసెంబర్ 13న) ప్రారంభం కానుంది.

Advertisement

50 వేల ఉద్యోగాల లక్ష్యం:
శంకుస్థాపన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ సంస్థను తానే ప్రారంభించానని గుర్తు చేసారు. “అప్పట్లో హైదరాబాద్‌లో కేవలం కాగ్నిజెంట్ ద్వారానే 75 వేల మంది ఉపాధి పొందారు. ఇప్పుడు వైజాగ్‌లో కాగ్నిజెంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కూడా కాగ్నిజెంట్ 50 వేల ఉద్యోగాలు కల్పించాలని  కోరుకుంటుట్లు తెలిపారు.

ఐటీ విస్తరణ:
విశాఖలో 8 సంస్థలకు నేడు ప్రారంభోత్సవం చేశామని, ఇప్పటికే నగరంలో 150 టెక్ కంపెనీలు ఉన్నాయని సీఎం తెలిపారు. ఏపీ తెలుగు యువత ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతున్నారని ఆయన కొనియాడారు. ఐటీ విస్తరణతో యువతకు మరింత ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వెల్లడించారు.

Advertisement

త్వరలోనే వైజాగ్ మెట్రో:
ఐటీ రంగ విస్తరణకు మౌలిక వసతులు కీలకమని పేర్కొన్న సీఎం వైజాగ్‌లో రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి త్వరలోనే మెట్రో రైల్ ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తామని ప్రకటించారు. కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు, మెట్రో వంటి మౌలిక సదుపాయాల కల్పనతో విశాఖ త్వరలోనే దేశంలోనే అత్యుత్తమ టెక్ హబ్‌గా రూపుదిద్దుకోనుంది. విశాఖకు ఉండే ప్రత్యేకతలు, సహజ వనరులు మరే నగరానికీ లేవు,” అని పేర్కొంటూ.. విశాఖను ప్రపంచ ఐటీ పటంలో నిలపడానికి తన కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Also Read: పబ్బా? పార్టీ క్లబ్బా? ఆ జనసేన కార్యాలయంలో మందుబాబుల జల్సాలు

టాలెంట్ హబ్ :

ఏపీ యువతలో టాలెంట్ (ప్రతిభ)కి కొరత లేదు. దానికి సరైన వేదికను, ప్రోత్సాహాన్ని అందించడమే మా లక్ష్యం. త్వరలోనే విశాఖపట్నం దేశంలోనే ‘మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్‌గా, అభివృద్ధి చెందిన నగరంగా మారబోతోంది. అంతే కాకుండా విశాఖలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి కాస్ట్ ఆఫ్ లివింగ్ అని సీఎం పేర్కొన్నారు. దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే వైజాగ్‌లో జీవన వ్యయం సుమారు 20 శాతం తక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఇది ఉద్యోగులు, కంపెనీలకు అదనపు ప్రయోజనం అని స్పష్టం చేశారు. నగర సహజ సౌందర్యాన్ని కాపాడుతూ..  మరింత సుందరమైన ప్రాంతంగా, కాలుష్య రహితంగా వైజాగ్‌ను మారుస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×