E-Paper
Advertisement

భోగాపురం ఈవెంట్.. నా మనసును తాకింది, నోరు విప్పిన సీఎం చంద్రబాబు

భోగాపురం ఈవెంట్.. నా మనసును తాకింది, నోరు విప్పిన  సీఎం చంద్రబాబు
Advertisement

Bhogapuram Event: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవంపై సీఎం చంద్రబాబు నోరు‌విప్పారు. ఈవెంట్ గ్రాండ్ సక్సెస్‌పై సంతోషం వ్యక్తం చేశారు. ప్రారంభం వైభోగంగా జరిగిందని చెప్పారు. అంతేకాదు దీనికి సంబంధించి ఓ వీడియో షేర్ చేశారు ముఖ్యమంత్రి.

భోగాపురం ఈవెంట్‌పై నోరు విప్పిన సీఎం చంద్రబాబు

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. భారీ ఎత్తున సాగిన ఈ ఈవెంట్‌పై నోరు విప్పారు సీఎం చంద్రబాబు. గ్రాండ్ సక్సెస్‌పై సంతోషం వ్యక్తం చేశారు. సభ తర్వాత విశాఖ నుంచి అమరావతి వచ్చారు ముఖ్యమంత్రి. శనివారం సాయంత్రం చేపట్టిన కార్యక్రమంపై నేతలు-మంత్రులు-అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు.

తాను ఎప్పటికీ మరిచిపోలేను- ముఖ్యమంత్రి

Advertisement

ఎయిర్‌పోర్టు ఈవెంట్ జీవితంలో గుర్తు ఉండిపోయేలా చేశామన్నారు. థింసాతో స్వాగతం మొదలు సభ వరకు ముగిసేవరకు అన్ని అద్భుతంగా జరిగాయన్నారు.  సభను విజయవంతం చేయడంలో మంత్రులు, అధికారులు సమన్వయంతో పని చేశారని అభినందించారు. ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రజల నుంచి వచ్చిన స్పందన తాను ఎప్పటికీ మరిచిపోలేనన్నారు.

మంచి పని చేస్తే ప్రజా స్పందన ఎలా ఉంటుందని చెప్పేందుకు దీని ద్వారా రుజువైందన్నారు. బస్సుల ఏర్పాటు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పని చేశారని కితాబు ఇచ్చారు. అలాగే ఈవెంట్‌కు వచ్చిన ప్రజలకు అందిన భోజనం, రవాణా సౌకర్యంపై సంతృప్తిగా ఉందని మంత్రులు ఈ సందర్భంగా వివరించారు.

Advertisement

ఆ వీడియో నా మనసును తాకింది- చంద్రబాబు

పెద్ద కార్యక్రమం పెట్టుకున్నామని అందరూ  టీం వర్క్ లా కలిసి పని చేయడం మంచి పరిణామం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల నుంచి వచ్చిన స్పందన తనకు జీవితంలో గుర్తుండిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవంతం కావడానికి శ్రమించిన అధికారులను ప్రత్యేకంగా కలిసి అవార్డులు ఇచ్చి ప్రోత్సహిద్దామని అన్నారు.

ALSO READ: పోలవరం జిల్లాలో గోదావరి ఉగ్రరూపం.. ఆ 4 రాష్ట్రాల సరిహద్దులు బంద్!

ముఖ్యంగా గిరిజన సోదరీమణులు ప్రారంభ వేడుకను అద్భుతంగా జరిపించడానికి పడిన కష్టం, ఓర్పు, త్యాగాలకు ఎంతగానో ముగ్ధుడినయ్యానని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చిన్న వీడియో పోస్టు చేశారు ముఖ్యమంత్రి.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×