E-Paper
Advertisement

Amaravati News: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. మరొకరు గవర్నర్ వద్దకు, ఏపీ బీజేపీ నేతలు అక్కడే మకాం

Amaravati News: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. మరొకరు గవర్నర్ వద్దకు, ఏపీ బీజేపీ నేతలు అక్కడే మకాం
Advertisement

Amaravati News: ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? మంత్రి సత్యకుమార్ హస్తినకు వెళ్లిన రెండు రోజులకు సీఎం చంద్రబాబు వెళ్లడం వెనుక మేటరేంటి? అదే సమయంలో మాజీ సీఎం జగన్ గవర్నర్‌తో భేటీ కానున్నారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న నేతలు తెర వెనుక ఏదో జరుగుతోందని అంటున్నారు. బాబు ఢిల్లీ టూర్‌లో ఏపీలో రకరకాల వాదనలు లేకపోలేదు.

ఇవాళ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Advertisement

ఎట్టకేలకు సీఎం చంద్రబాబు రెండురోజుల ఢిల్లీ టూర్ ఖరారు అయ్యింది. డిసెంబర్ 18న అంటే ఇవాళ గురువారం సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. సచివాలయం నుంచి హెలికాఫ్టర్ ద్వారా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్తారు. గురువారం రాత్రికి వన్ జనపథ్‌‌లో ముఖ్యమంత్రి బస చేయనున్నారు.

విదేశీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారు. గురువారం సాయంత్రానికి ఆయన ఢిల్లీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే సీఎం చంద్రబాబు అక్కడికి చేరుకుంటున్నారు. శుక్రవారం పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. అలాగే పీఎం మోదీతో వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇందుకు కారణాలు లేకపోలేదు.

Advertisement

గవర్నర్ వద్దకు జగన్, హస్తినలో  ఏపీ బీజేపీ నేతలు

ఏపీకి ఆర్థిక సమస్యలు తీవ్రంగా వెంటాడుతున్నాయి. డిసెంబర్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి జీతాలు ఇవ్వాల్సి ఉండగా, నాలుగు తేదీ నుంచి వారి ఖాతాల్లో జమ అయ్యాయి.  డిసెంబర్‌లో జీతాలు ఆలస్యం కావడంపై రకరకాల కథనాలు లేకపోలేదు.  ఈ వ్యవహారంపై ప్రధానితో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి వెళ్తున్నట్లు సచివాలయం వర్గాలు చెబుతున్నాయి.  వచ్చే నెల ఒకటిన జీతాలు పడే అవకాశముందని అంటున్నారు.

ఏపీలో కొత్తగా నిర్మించనున్న మెడికల్ కాలేజీలపై వైసీపీ చేస్తున్నట్లు రాద్ధాంతాన్ని కేంద్రం పెద్దల చెవిలో వేయనున్నారు సీఎం చంద్రబాబు.  ప్రస్తుతం ఆరోగ్యశాఖకు సత్యకుమార్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీని ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందట వైసీపీ.

ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం మాజీ సీఎం జగన్.. గవర్నర్‌ని కలవనున్నారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై సేకరించిన కోటి సంతకాల పత్రాలను గవర్నర్‌కు అందజేయనున్నా రు. పీపీపీ తాము అంగీకరించలేదని తెగేసి చెబుతోంది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ విషయంలో వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోంది.

ALSO READ: ఒబెరాయ్ కోసం టీటీడీ భూములు ధారాదత్తం, సీఎంపై భూమున ఫైర్

మెడికల్ కాలేజీల నిర్మాణం విషయంలో పీపీపీ విధానమే మంచిదని కేంద్రానికి ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. ఆ కమిటీలో వైసీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి ఉన్నారు. పీపీపీ విధానానికి వైసీపీ ఓకే చేసింది. అదే అంశంపై ఏపీలో సంతకాల సేకరణ మొదలుపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపుతో రెండురోజుల కిందట ఢిల్లీకి వెళ్లారు మంత్రి సత్యకుమార్. ఆయన వెంట ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఉన్నారు. పార్టీ పెద్దలతో వివిధ అంశాలపై వారిద్దరు మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇది జరిగి రెండు రోజుల తర్వాత సీఎం చంద్రబాబు హస్తినకు వెళ్లడం ఏదో జరుగుతోందని అంటున్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×