E-Paper
Advertisement

CM Chandrababu On Ysrcp: 11 అంకెతో వైసీపీకి ఏదో సంబంధం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

CM Chandrababu On Ysrcp: 11 అంకెతో  వైసీపీకి ఏదో సంబంధం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu On Ysrcp: ఏపీకి కొత్త సమస్య మొదలైందన్నారు. వైసీపీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, నక్సలిజం బాగానే తగ్గిందని, రాజకీయ ముసుగులో కొందరు నేతలు నేరాలకు పాల్పడుతున్నట్లు వ్యాఖ్యానించారు. చివరకు ప్రతిపక్ష నేత రోడ్డు మీద వెళ్తున్నారంటే ఆ రోజు ఏం జరుగుతుందోనని భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. సమాజానికి ఇది మంచి పద్దతి కాదన్నారు.

అసెంబ్లీ వేదికగా వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు

Advertisement

గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాయలసీమలో ప్రస్తుతం ఫ్యాక్షన్స్ లేవన్నారు. వేరే రకమైన నేరాలు ఉండవచ్చని, దాన్ని పూర్తిగా రూపు మాపామన్నారు. మతవిద్వేషాలు కంట్రోల్ చేశామన్నారు. ప్రతిపక్ష నేత రోడ్డు మీద వెళ్తున్నారంటే ఏం జరుగుతుందోనని భయం ఏర్పడిందన్నారు.

ఆయన ఎక్కడికి వెళ్లినా రోడ్లు బ్లాక్ చేయడం సరైన పద్దతి కాదన్నారు. విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్లాలంటే ఆరుగంటలా? విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లాలంటే ఏడు గంటలా? ఆ రోజు రోడ్డు మీదకు వచ్చినవారికి నరకం కనిపిస్తుందన్నారు. నేషనల్ హైవేల గురించి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేస్తూ హెచ్చరించారు.

Advertisement

ఏపీకి కొత్త సమస్య.. 11 అంకెతో వైసీపీకి ఏదో సంబంధం-సీఎం

వాటిపై మీటింగ్ పెట్టురాదని, ట్రాఫిక్ జామ్ కాకూడదని, చివరకు విగ్రహాలు పెట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని వివరించారు. ఆ నిబంధనలు ఉల్లంఘించే పరిస్థితి వచ్చిందన్నారు. తిరుమల లడ్డూపై కూడా నోరు విప్పారు. ఆనాడు ఆ విషయంపై మాట్లాడ కుండా ఉంటే మన మీదకు నెట్టేసేవారన్నారు. కల్తీ లడ్డూకు హెరిటేజ్‌ని తీసుకురావడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్రాండ్ డ్యామేజ్ చేయడానికి చూస్తున్నారని, దానివల్ల ఆ కంపెనీకి నష్టం వస్తుందన్నారు. ఆనం వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రస్తావించారు. నేరాన్ని తప్పించుకోవడానికి ఎవరిపైనా తోయడానికి వారు సిద్ధంగా ఉన్నారన్నారు. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. 11 గంటలకు 11 నిమిషాలకు కరెక్టుగా వైసీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లారన్నారు.

ALSO READ: సీఎం రేవంత్ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు రియాక్ట్

ఈ లెక్కన 11 అంకెకు వైసీపీకి ఏదో అవినాభావ సంబంధం ఉందన్నారు ముఖ్యమంత్రి. ఆ సమయంలో సభలో విధ్వంసం క్రియేట్ చేసి, గవర్నర్‌ని ఇన్సల్ట్ చేశారన్నారు. పేపర్లు చించుకోవచ్చని, కానీ గవర్నర్ పై వేయడం ముమ్మాటికీ దుర్మార్గమన్నారు. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన చేశారని, అప్రజాస్వామికంగా ఎవరు చేసినా దాన్ని ఖండించాలన్నారు సీఎం చంద్రబాబు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×