E-Paper
Advertisement

పామర్రు సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ఇవాళ్టి నుంచి ప్రారంభం, నేతల్లో కొత్త టెన్షన్

పామర్రు సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ఇవాళ్టి నుంచి ప్రారంభం, నేతల్లో కొత్త టెన్షన్
Advertisement

CM Chandrababu: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి దాదాపు రెండేళ్లు గడుస్తోంది. మరో మూడేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతలపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేల పని తీరుపై ప్రజాభిప్రాయ సేకరణ ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నామని తేల్చేచెప్పేశారు. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రుల్లో చిన్నపాటి టెన్షన్ మొదలైంది.

పామర్రు సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Advertisement

సీఎం చంద్రబాబు కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పమిడిముక్కలలో ఏర్పాటు చేసిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. నేతల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

ప్రజల నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఒకవేళ సభకు వచ్చిన ప్రజలు చేతులెత్తకుంటే ఎమ్మెల్యే కరెక్టు చేసుకోవాలన్నారు. ఒకవేళ ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోకుంటే మీ తరపున నేను ఉంటానని, ఎమ్మెల్యే తరపున ఉండనని తేల్చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పని చేయాలన్నారు.

Advertisement

ఇవాళ్టి నుంచి ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయ సేకరణ మొదలు

సీఎం చంద్రబాబు ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రుల పని తీరుపై అంతర్గతంగా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సరిగా పని చేయనివారిని పిలిచి క్లాస్ తీసుకున్న సందర్భాలు ఇటీవల కాలంలో కనిపించాయి.  ఇప్పుడు మాత్రం ప్రజల నుంచి అభిప్రాయసేకరణ తీసుకుంటామని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటనతో కొందరి నేతల్లో అప్పుడే టెన్షన్ మొదలైంది.

విపక్షాలు మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకున్నాయి కానీ, త్వరలో ఆడబిడ్డలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు రాబోతున్నాయని తేల్చి చెప్పారు. అన్నిరంగాల్లో మహిళలు రాణించాలన్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలనేది తన ఆలోచన అని, అమరావతికి ఈఎస్ఐ ఆసుపత్రి తీసుకొస్తామన్నారు.

ALSO READ: ఏపీ ప్రభుత్వానికి చేరిన తిరుమల లడ్డు నివేదిక.. అధికారులపై చర్యలు, రాజకీయ నేతల మాటేంటి?

పనిలో పనిగా వైసీపీపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వైసీపీ కాదని, అది గొడ్డలి పార్టీ అని తేల్చేశారు. నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులు రాజకీయాలకు పనికి రారని, అతనికి ఓ మానసిక సమస్య ఉందన్నారు. అందరినీ మోసం చేయడం, అవకాశం ఇస్తే అందర్నీ నాశనం చేయడమేనని అన్నారు. ఐదేళ్లు ఏం జరిగిందో మీరే చూశారన్నారు.

అధికారంలోకి వచ్చిన తొలిరోజు ప్రజా వేదికను కూల్చివేశారని అన్నారు. పోలవరం పూర్తి అయితే ఓ వరంగా మారేదని అన్నారు. నీటి ఎద్దడి పోయేదని, అలాంటి ప్రాజెక్టును నాశనం చేశారని, దేవతల రాజధాని అమరావతిని శ్మశానం, ఏడారి అంటూ రకరకాలుగా కామెంట్స్ చేశారని గుర్తు చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×