// // TDP Politics: వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే.. టీడీపీ జిల్లాల అధ్యక్షుల ప్రకటన -->
E-Paper
Advertisement

TDP Politics: వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే.. టీడీపీ జిల్లాల అధ్యక్షుల ప్రకటన.. కొత్తవారికి టాస్క్ రెడీ

TDP Politics:  వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే..  టీడీపీ జిల్లాల అధ్యక్షుల ప్రకటన..  కొత్తవారికి టాస్క్ రెడీ
Advertisement

TDP Politics: వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచి సీఎం చంద్రబాబు రెడీ అయ్యారా? అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపు జిల్లాల అధ్యక్షులను ఎంపిక చేయడం వెనుక మేటరేంటి? కొత్త అధ్యక్షులకు స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద టాస్క్ కానున్నాయా? ఎన్నికల్లో సత్తా చాటని వారిని తప్పిస్తారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే టీడీపీ రెడీ

Advertisement

ఎట్టకేలకు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. వచ్చే ఎన్నికలను టార్గెట్ పెట్టుకుని ఇప్పటి నుంచి చకచకా అడుగులు వేస్తున్నారు అధినేత. ద్వితీయశ్రేణి నాయకత్వానికి ఈసారి నామినేటెడ్, పార్టీ పదవుల్లో ప్రయార్టీ ఇచ్చారు. కేవలం పరిపాలన విషయంలోనే కాదు.. పార్టీ పదవుల విషయంలో అదే పంథాను అనుసరిస్తున్నారు.

పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదికి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఇప్పుడు జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల వంతైంది. మొత్తం 25 జిల్లాలకు సంబంధించి పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ప్రకటించారు అధినేత. ఓసీ-11, బీసీ-8,ఎస్సీ-4, ఎస్సీ-మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. గతంలో జిల్లాల అధ్యక్షులుగా ఉన్నవారిని మార్చారు.

Advertisement

టీడీపీ జిల్లాల అధ్యక్షుల ప్రకటన

కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు ఎలాంటి సోషల్ ఇంజనీరింగ్ అమలు చేశారో, కేబినెట్ కూర్పులోనూ అదే చేశారు. చివరకు జిల్లాల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శుల విషయంలో అదే ఫార్ములాను వర్కవుట్ చేశారు. మహిళలకు ఈసారి పెద్ద పీఠ వేశారు.

కొత్తగా ఎన్నికైన జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు పెద్ద టాస్క్ రెడీ అయ్యింది. వచ్చే ఏడాది జనవరి లేదా మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ హైకమాండ్ ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల అధ్యక్షుల ప్రకటన చేశారన్నది పార్టీలో కొందరి నేతల మాట. స్థానిక సంస్థల ఎన్నికలు ఆయా నేతలకు బిగ్ ఛాలెంజ్ అన్నమాట.

ALSO READ: పవన్ వర్సెస్ వైసీపీ.. భయపెడతారా? భయపడతారా?

మొన్నటి ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు, నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం రానివారికి ఈసారి ఛాన్స్ ఇచ్చింది టీడీపీ హైకమాండ్. గతంలో జిల్లాల పార్టీ కమిటీల్లో 30 మంది సభ్యులుండేవారు, ఆ సంఖ్య 40 వరకు పెంచినట్టు తెలుస్తోంది. మిగతా పదవులకు తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు చోటు కల్పించనున్నారట.

దీనివల్ల పార్టీని నమ్ముకున్నవారికి అవకాశం ఇవ్వడమేకాదు, అన్నివర్గాలకు దిగువస్థాయి నుంచి అవకాశం ఇచ్చినట్లయ్యిందని కొందరి నేతల మాట.  రానున్న ఎన్నికల్లో సరైన ప్రతిభ చూపనివారని ఆ తర్వాత హైకమాండ్ పక్కన పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో జిల్లా అధ్యక్షులుగా చేసినవారిని పార్టీలోకి తీసుకోవాలని భావిస్తోందట పార్టీ. మొత్తానికి లోకేష్‌కు బలమైన టీమ్ రెడీ అయ్యిందని అంటున్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×