E-Paper
Advertisement

CM Chandrababu: ఎదురుగా ట్రైన్..వెనుక డ్యాం.. సీఎం ఎలా తప్పించుకున్నారంటే?

CM Chandrababu: ఎదురుగా ట్రైన్..వెనుక డ్యాం.. సీఎం ఎలా తప్పించుకున్నారంటే?
Advertisement

AP CM Chandrababu Missed Train Accident: విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు పెద్ద పెను ప్రమాదం తప్పింది. దేవీనగర్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు రైల్వే బ్రిడ్జిపై ఉన్న సమయంలోనే ఓ రైలు ఎదురుగా వచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సమాచారం అందించారు. దీంతో సీఎం పక్కన ఉన్న ర్యాంపు పైకి వెళ్లారు. ఆ తర్వాత కార్యకర్తలు ఎర్ర జెండా పట్టుకొని ఊపారు. సరిగ్గా చంద్రబాబుకు మూడు అడుగుల దూరంలో ట్రైన్ వెళ్లింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

మధురానగర్‌లో వద్ద బుడమేరును పరిశీలించేందుకు కాలినడకన రైల్వే వంతెనపై నడిచి వెళ్లారు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది వారించినప్పటికీ వినకుండా రైలు వంతెనపై చంద్రబాబు నడిచి బుడమేరును పరిశీలించారు. ఈ సమయంలో ఆయన రైలు వంతెనపై నడుస్తుండగా.. ఓ రైలు సీఎం చంద్రబాబుకు ఎదురుగా అతి సమీపంగా వచ్చింది.

Advertisement

వెంటనే అప్రమత్తమైన చంద్రబాబు రైలు తగలకుండా ఓ పక్కకు నిలబడి ఉండడంతో ప్రమాదం తప్పింది. చంద్రబాబుకు అతి సమీపంలో రైలు వెళ్లడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడం ఊపిరి పీల్చుకున్నారు. రైలు దాటాక అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇందులో భాగంగా ఎనికేపాడు వద్ద ఏలూరు కాల్వ దాటి బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బల్లకట్టుపై వెళ్లిన ఆయన.. అక్కడ గండ్లు పడిన ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలపై చర్చించారు. అలాగే దెబ్బతిన్న పంటల వివరాలను తెలుసుకున్నారు.

Advertisement

Also Read: టీడీపీ హైకమాండ్ ఆగ్రహం.. ఎమ్మెల్యే ఆదిమూలంపై వేటు

అలాగే కేసరపల్లి వద్ద బుడమేరు కాల్వపై వరద ఉధృతిని పరిశీలించారు. భవిష్యత్తులో విజయవాడకు మళ్లీ వరదలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం బుడమేరులో వరద ప్రభావం తగ్గిందని, అధికారులు బాధ్యతగా పనిచేయాలని చెప్పారు. బుడమేరు కాల్వ ప్రక్షాళన చేపడతామని, ఇప్పటికే ఈ కాల్వ ఆధునీకరణకు నిధులు కూడా కేటాయించినట్లు గుర్తుచేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×