// // Cm Chandrababu : శభాష్... చాలా మంచి పని చేశారు, ప్రజలను మెచ్చుకున్న సీఎం చంద్రబాబు -->
E-Paper
Advertisement

Cm Chandrababu : శభాష్… చాలా మంచి పని చేశారు, ప్రజలను మెచ్చుకున్న సీఎం చంద్రబాబు

Cm Chandrababu : శభాష్… చాలా మంచి పని చేశారు, ప్రజలను మెచ్చుకున్న సీఎం చంద్రబాబు
Advertisement

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రాయలసీమ జిల్లాల్లో పర్యటించారు. ఈ మేరకు కర్నూలు జిల్లాలోని పుచ్చకాయలమడ గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను వైసీపీ సర్కారు ధ్వంసం చేసిందని గ్రామసభలో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే జగన్ పోతూ పోతూ ఏపీ ఖజానా సైతం ఖాళీ చేసి వెళ్లారని, దాదాపుగా రూ.10 లక్షల కోట్ల అప్పులు మిగిలాయన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు చైతన్యంతో కూటమికి ఓట్లేసి అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారని కొనియాడారు. ఈ క్రమంలోనే కూటమికి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.  కూటమి ప్రభుత్వం వచ్చాక ఫించన్ 4 వేల రూపాయలు చేశామని చెప్పుకొచ్చారు.

Advertisement

కూటమి సర్కారులో ఒకటో తేదీ రాగానే అధికారులే ఫించన్లు పట్టుకుని మీ ఇంటికొచ్చి ఇస్తున్నారని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని వివరించారు. ఉద్యోగులకు సైతం తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెలా జీతాలు సమయానికే ఇస్తున్నామని గుర్తు చేశారు.

also read : కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా?.. అయితే ఈ శుభవార్త తెలుసా..?

Advertisement

జీతాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందనవసర లేదని నొక్కి చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఎన్నోమందిని చూశానన్న సీఎం, ఇలాంటి వ్యక్తిని మాత్రం ఎక్కడా చూడలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఇతను చెయ్యకూడని తప్పులు చేశాడని, అవన్నీ ప్రజలకు ప్రతిబంధకంగా మారాయన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×