E-Paper
Advertisement

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!
Advertisement

Kadambari Jethwani: ముంబై నటి కాదంబరి జత్వాని ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి తీవ్ర సంచలనంగా మారింది. గతంలో పలువురు పోలీసు అధికారుల సస్పెన్షన్‌కు కారణమైన ఈ వ్యవహారంలో విజయవాడ సీఐడీ కోర్టులో దాఖలైన ఛార్జ్‌షీట్‌తో ఒక ఊహించని మలుపు చోటుచేసుకుంది. నటి కాదంబరి జత్వానినే వైఎస్సార్‌సీపీ నేత విద్యాసాగర్‌ను బ్లాక్‌మెయిల్ చేసి, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సీఐడీ తన విచారణలో తేల్చడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?

Advertisement

సీఐడీ కోర్టుకు సమర్పించిన ఛార్జ్‌షీట్ ప్రకారం.. కుక్కల విద్యాసాగర్‌తో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఆసరాగా చేసుకుని కాదంబరి జత్వాని ఈ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో తీసిన కొన్ని వ్యక్తిగత ఫోటోలను చూపించి, వాటిని బయటపెడతానంటూ ఆమె విద్యాసాగర్‌ను బెదిరింపులకు గురిచేసింది. సమాజంలో తన పరువు పోతుందనే భయంతో విద్యాసాగర్ ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ వచ్చారని సీఐడీ తన నివేదికలో స్పష్టం చేసింది.

రూ. 1.32 కోట్ల నగదు బదిలీ

Advertisement

ఈ బ్లాక్‌మెయిలింగ్ వ్యవహారంలో కేవలం బెదిరింపులే కాకుండా, భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సీఐడీ పక్కా ఆధారాలను సేకరించింది. కాదంబరి జత్వాని, ఆమె తల్లికి ఉన్న ఉమ్మడి బ్యాంక్ ఖాతాకు విద్యాసాగర్ విడతల వారీగా నగదు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. మొత్తంగా రూ.1.32 కోట్లను ఆమె విద్యాసాగర్ నుంచి వసూలు చేసినట్లు బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ల ద్వారా సీఐడీ ఆధారాలతో సహా ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచింది.

కేసులో ఊహించని మలుపు

వాస్తవానికి ఈ కేసు గతంలో వేరే మలుపు తిరిగింది. నటి జత్వాని ఇచ్చిన ఫిర్యాదులు, ఆమెపై జరిగిన విచారణ తీరుపై అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఈ కేసును సరిగ్గా హ్యాండిల్ చేయలేదనే ఆరోపణలపై ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో బాధితుడిగా ఉన్న విద్యాసాగరే అసలైన నిందితురాలి చేతిలో మోసపోయాడని తేలడంతో కథ అడ్డం తిరిగింది. పక్కా సాక్ష్యాలతో సీఐడీ వేసిన ఈ ఛార్జ్‌షీట్ రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

Also Read: రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×