E-Paper
Advertisement

Chiru support to CM Ramesh: సపోర్టు ఓకే.. ప్రచారం మాటేంటి?

Chiru support to CM Ramesh: సపోర్టు ఓకే.. ప్రచారం మాటేంటి?
Advertisement

Chiru support to CM Ramesh(Political news in AP): ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కొన్ని సీట్లలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేము. ఈ క్రమంలో పలువురి మద్దతు కోరే ప్రయత్నంలో నేతలు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సినది అనకాపల్లి ఎంపీ సీటు. కూటమి పొత్తుల్లో భాగంగా బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ బరిలోకి దిగారు. రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తి అక్కడ పోటీ చేయడం ఇదే తొలిసారి.

ఆయనకు ధీటుగా అదే సామాజికవర్గానికి చెందిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని రంగంలోకి దించింది జగన్ పార్టీ. దీంతో ఇక్కడ గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ మాత్రం నాన్ లోకల్ అభ్యర్థి అంటూ ప్రచారంలో దూసుకుపోతోంది. దీనికి కౌంటర్ ఇవ్వలేక సతమతమవుతున్నారు సీఎం రమేష్. ఈ క్రమంలో ముఖ్యమైన నేతలను కలిసి వారి మద్దతు కోరుతున్నారాయన.

Advertisement

తాజాగా బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్.. నటుడు చిరంజీవిని కలిశారు. తన మద్దతు మీకే ఇస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయంది, మీ వెంట తాను ఉంటానని చెప్పుకొచ్చారు చిరంజీవి. మద్దతు ఓకే.. చిరంజీవి ప్రచారానికి వస్తారా? అన్నదే ఇక్కడ అసలు పాయింట్. చిరు రాజకీయాల్లోకి రారని చాలామంది చెబుతున్నారు. పాలిటిక్స్ ఇష్టంలేక ఆయన దూరంగా ఉన్నారని, ఈ విషయాన్ని పలుమార్లు ఆయనే చెప్పారని గుర్తు చేస్తున్నారు.

ALSO READ: జగన్‌పై రుసరుసలు, ఇదే పాలన..!

Advertisement

ఒక్కసారి వెనక్కి వెళ్తే.. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్య తరపున అల్లుఅరవింద్ పోటీ చేశారు. అప్పుడు ఆయన ఓటమిపాలయ్యారు. కాకపోతే ఆయనకు దాదాపు మూడు లక్షలు ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థికి మూడులక్షల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ఓట్లు తనకే పడితే గెలుపు సునాయాశమని సీఎం రమేష్ భావిస్తున్నారు. ఈ క్రమంలో చిరు మద్దతు కోరినట్టు తెలుస్తోంది. తనకున్న పాత పరిచయాలతో ఇప్పటికే పలు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలతో సీఎం రమేష్ భేటీ అయ్యారు. వారి నుంచి సానుకూలంగా స్పందన వచ్చింది. బీజేపీ, టీడీపీ, జనసేన నుంచి ముఖ్యనేతలతో సభలు పెడితే ఓటర్ల మూడ్ మారుతుందన్నది రమేష్ అంచనా.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×