E-Paper
Advertisement

Nara lokesh : ‘చిన్నబాబు’ ఫీవర్.. ఆ వైసీపీ కీలక నేత అరెస్టు తప్పదా?

Nara lokesh : ‘చిన్నబాబు’ ఫీవర్.. ఆ వైసీపీ కీలక నేత అరెస్టు తప్పదా?
Advertisement

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం సీఎం చంద్రబాబు పాలన మీద దృష్టి సారించారు. రాజధాని అమరావతి అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమం, రైతు సంక్షేమంపై ప్రధానంగా దృష్టిసారించారు.ఇక పార్టీపరమైన అంశాలను చిన్నబాబు అంటే మంత్రి నారాలోకేశ్ చక్కదిద్దుతున్నట్టు తెలుస్తున్నది. ఓవైపు ఐటీ మంత్రిగా తన మార్క్ చూపిస్తునే మరోవైపు విదేశీలకు వెళ్లి పెట్టుబడులు రాబట్టడంలోనూ తన వంతు పాత్రను పోషిస్తున్నారు. దీనికి తోడు అక్రమార్కుల పని పట్టడంలో చిన్నబాబు స్టైల్ మారిందని తెలుగు తమ్ముళ్లు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.గతంలో చూసిన లోకేశ్ వేరు.. అని ఇప్పుడు వేరని ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

పాలనపై పట్టు సాధించి..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా లోకేశ్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో ఎక్కడ విధ్వంసం జరిగిందో దానిపై ప్రధానంగా దృష్టిసారించారు. అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేశారు. నిరుద్యోగులకు వెనువెంటనే నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేశారు. ఆ తర్వాత పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై ఫోకస్ చేశారు. విద్యారంగంలో టెక్నాలజీపై ప్రధానంగా ఫోకస్ చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దేందుక కంపెనీలను ఆహ్వానించారు. వారికి ప్రోత్సహాకాలు, రాయితీలు సైతం కల్పించారు. ఆయన కృషి వలన గూగుల్ డేటా సెంటర్‌తో పాటు పలు అంతర్జాతీయ కంపెనీలు ఏపీలో తమ హబ్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చి ఒప్పందాలు చేసుకున్నాయి.

అక్రమార్కులకు చుక్కలే..

Advertisement

పాలన సంగతి అటుంచితే అక్రమార్కుల గుండెల్లో చిన్నబాబు రైళ్లు పరిగెత్తుస్తున్నారని ప్రతిపక్ష వైసీపీలోనూ చర్చ జరుగుతున్నది. జగన్ అధికారంలో ఉన్న ఉన్నప్పుడు తన తల్లిని అవమానించిన వారిని అస్సలు వదిలేది లేదని లోకేశ్ చెప్పారు. ఇక తన తండ్రిని జైలు పంపించేలా చేసిన వారిపైన చర్యలుంటాయని హెచ్చరించారు.ఆ మేరకు సైలెంటుగా వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే వల్లభనేని వంశీ, కొడాలి నానిలను అరెస్టు చేయించారు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న వల్లభనేని వంశీ మరోసారి అరెస్టు అవుతారని జోరుగా చర్చ జరుగుతున్నది.

 

Advertisement

గతంలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో జైలుకు వెళ్లొచ్చిన వంశీని.. 2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై జరిగిన దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఈనెల 17న వంశీపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన వంశీ అప్పటి నుంచి అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయినట్టు తెలుస్తున్నది. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక నకిలీఇళ్ల పట్టాల స్కాంలో వైసీపీ కీలక నేత అయిన వంశీ 137 రోజులు పాటు జైలు జీవితం గడిపారు. ఇదిలాఉండగా, నారా లోకేశ్ కావాలని కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది. వల్లభనేని వంశీ మీద చిన్నబాబుకు ఇంకా కోపం తగ్గినట్టు లేదంటూ కొందరు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు సైతం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కాగా, చట్టప్రకారమే పోలీసులు వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు వైసీపీకి కౌంటర్ ఇస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×