E-Paper
Advertisement

CM Chandrababu: నగరిలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర దిశగా అడుగులు!

CM Chandrababu: నగరిలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర దిశగా అడుగులు!
Advertisement

CM Chandrababu: నేడు స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగరిలో పర్యటించనున్నారు. ఉదయం 11:00 గంటలకు నగరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. స్థానిక నాయకులు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలకనున్నారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో హెలిప్యాడ్ వద్దే సామాన్యుల నుంచి ఆయన అర్జీలను స్వీకరించనున్నారు.

స్వచ్ఛ రథాల ప్రారంభోత్సవం
హెలిప్యాడ్ నుండి రోడ్డు మార్గంలో ప్రయాణించి సీఎం శాప్ (SAP) క్రీడా మైదానానికి అయిన చేరుకుంటారు. ఆ తర్వాత పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు చిత్తూరు, బంగారుపాళ్యం, ఐరాల మండలాలకు కేటాయించిన స్వచ్ఛ రథాలను (చెత్త సేకరణ వాహనాలు) ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో పారిశుధ్య సేవలను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

వసతి గృహాలు ఆసుపత్రి తనిఖీ
అలాగే మధ్యాహ్నం 1:50 గంటలకు సీఎం చంద్రబాబు విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా స్థానిక బాలుర బాలికల సంక్షేమ వసతి గృహాలను సందర్శించి, అక్కడ అందుతున్న వసతులు, భోజన నాణ్యతను పరిశీలిస్తారు. అనంతరం 2:15 గంటలకు నగరి ఏరియా ఆసుపత్రికి వెళ్లి, వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడతారు. ప్రభుత్వ వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అంశంపై ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నారు.

పార్టీ శ్రేణులతో దిశానిర్దేశం
ప్రభుత్వ కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 2:40 గంటలకు జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో తెలుగుదేశం పార్టీ కీలక నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం,
స్థానిక రాజకీయ పరిణామాలపై ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూనే, కార్యకర్తల అభిప్రాయాలను కూడా ఆయన వింటారు.

Advertisement

Also Read: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వరుసగా ఢీకొన్న మూడు వాహనాలు.. స్పాట్ లో 13 మంది!

ముగియనున్న పర్యటన
అన్ని కార్యక్రమాలు ముగించుకున్నాక, సాయంత్రం 3:55 గంటలకు నగరి హెలిప్యాడ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి ప్రయాణం కానున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా నగరిలో జిల్లా యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ట్రాఫిక్ మళ్లింపులు, పోలీసు బందోబస్తును జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×