E-Paper
Advertisement

ఎర్రబస్సు రాదన్న చోటకు ఎయిర్‌పోర్ట్.. చంద్రబాబు మాస్ కౌంటర్

ఎర్రబస్సు రాదన్న చోటకు ఎయిర్‌పోర్ట్.. చంద్రబాబు మాస్ కౌంటర్
Advertisement

CM Chandrababu: శంషాబాద్ ఎయిర్ పోర్టుతో తెలంగాణ దశ దిశ మారిందని.. ఇప్పుడు భోగాపురంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్ట్ ప్రారంభం కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ను ఉత్తరాంధ్రకు మణిహారంగా అభివర్ణించారు.

గతంలో కొందరు ఉత్తరాంధ్రకు ఎర్రబస్సు కూడా రాదని అన్నారని చంద్రబాబు గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఎయిర్ బస్ వచ్చిందని మాస్ కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని అవహేళన చేసినవారు అడ్రస్ లేకుండా పోయారని చురకలు అంటించారు. ఈ భోగాపురం ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్రకే గర్వకారణమని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాంత వాసి అయిన అల్లూరి పేరు చేబితే గుండె ఉప్పొంగుతుందని.. అందుకే ఎయిర్ పోర్టుకు ఆయన పేరునే పెట్టినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisement

మరోవైపు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు పునరుద్ఘటించారు. ఈ క్రమంలోనే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు సెంటిమెంట్ ను ప్రధాని నరేంద్ర మోదీ నిలబెట్టారని గుర్తుచేశారు. విశాఖ రైల్వే జోన్, పోలవరం, రాజధాని అమరావతికి నిధులు ఇచ్చింది కూడా మోదీనే అని కొనియాడారు. ‘2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం.. ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తాం. 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులను పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే ప్రారంభిస్తాం’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే అల్లూరి ఎయిర్ పోర్టులో అడుగడుగునా తెలుగు సంప్రదాయం ఉట్టిపడుతోందని చంద్రబాబు అన్నారు. విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. 2 ఏళ్లలో ప్రధాని మోదీ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులు.. రూ.6.13 లక్షల పెట్టుబడులు తీసుకొచ్చామని చంద్రబాబు అన్నారు. అవి పూర్తైతే 5.57 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. వచ్చే 3 ఏళ్లల్లో రూ.2784 కోట్లతో ఇక్కడి 8 ప్రధాన సాగు నీటి ప్రాజెక్టులు సైతం పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Advertisement

Also Read: ఉత్తరాంధ్ర బిడ్డగా చెబుతున్నా.. మోదీ ముందు రామ్మోహన్ ఎమోషనల్!

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×