E-Paper
Advertisement

Chandrababu Naidu : కాంచీపురంలో టీడీపీ చీఫ్.. 3000 ఏళ్ల నాటి ఆలయంలో చంద్రబాబు పూజలు..

Chandrababu Naidu : కాంచీపురంలో టీడీపీ చీఫ్..  3000 ఏళ్ల నాటి ఆలయంలో చంద్రబాబు పూజలు..
Advertisement
Chandrababu Naidu latest news

Chandrababu Naidu latest news(AP news today telugu):

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీపెరంబుదూర్ ఆదికేశవ పెరుమాళ్ ఆలయన్ని దర్శించుకున్నారు. తమిళనాడు.. కాంచీపురం జిల్లాలోని శ్రీ పెరంబుదూర్‌లో 3000 సంవత్సరాల నాటి ఆదికేశవ పెరుమాళ్ ఆలయం ప్రసిద్ధి గాంచింది.

చంద్రబాబు నాయుడు బుధవారం కుటుంబ సమేతంగా స్వామి దర్శనం కోసం ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళారు. ఈ సందర్భంగా కాంచీపురం జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడును హిందూ ధార్మిక శాఖ వారు సన్మానించారు. శాలువా కప్పి.. పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఏనుగు నుంచి చంద్రబాబుకు ఆశీస్సులు అందించారు.

Advertisement

స్వామి వారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి.. ఆలయ రికార్డు పుస్తకంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు చంద్రబాబు నాయుడుకు రామానుజుల ఫొటోను సావనీర్‌గా బహూకరించారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టమన్నారు చంద్రబాబు. తెలుగువారి కోసం తాను అంకితభావంతో పనిచేస్తానని.. అందరికీ మంచి జరగాలని తాను ప్రార్ధించినట్లు తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×