E-Paper
Advertisement

PM Kisan Annadata Sukhibhava: రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన చంద్రబాబు

PM Kisan Annadata Sukhibhava: రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన చంద్రబాబు
Advertisement

PM Kisan Annadata Sukhibhava: వైఎస్సార్‌ కడప జిల్లా పెండ్లిమర్రిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, “పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ” పథకం రెండో విడత నిధులను విడుదల చేశారు. స్థానిక ప్రజావేదిక నుంచి ఆయన ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 47 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా, మొత్తం రూ. 3,200 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో ఒక్కో రైతు ఖాతాలో రూ. 7,000 చొప్పున జమ కానున్నాయి. అంతకుముందు సీఎం ‘మన గ్రోమోర్‌’ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి, అక్కడి రైతులతో ముచ్చటించారు. వ్యవసాయ పెట్టుబడి సాయం కింద ఈ నిధులు రైతులకు అండగా ఉంటాయని చంద్రబాబు తెలిపారు.

Advertisement

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..  నేడు రైతుల అకౌంట్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేశామన్నారు. ఈ స్కీమ్ కింద తొలి విడతలో 3,174 కోట్ల రూపాయలు ఆగష్టులో జమ చేశామన్న సీఎం.. రెండో విడత 3135 కోట్లు మీ అకౌంట్ లో జమ చేసినట్లు తెలిపారు. వ్యవసాయం లాభసాటి కావాలని, రైతుల జీవితాలు బాగుపడాలని అన్నారు. రైతులు కొత్తగా ఆలోచించి వ్యవసాయం చేయాలని, ఆధునిక పద్దతులు అవలంభించి సాగు చేయాలని సీఎం కోరారు. మనం పండించిన పంటలు ప్రపంచానికి చేరువ చేసినప్పుడు రైతులు బాగుంటారని అన్నారు.

రైతుల భవిష్యత్తును మార్చేందుకు ఐదు ‘పంచ సూత్రాలను’ (నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రి-టెక్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ప్రభుత్వ సహకారం) సీఎం ప్రతిపాదించారు. ముఖ్యంగా నీటి భద్రతపై మాట్లాడుతూ, రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చి, శ్రీశైలం నీటిని సీమకు మళ్లించడం వల్లే నేడు ఈ ప్రాంతంలోని రిజర్వాయర్లు 95 శాతం నిండుకుండలా మారాయని, ఇది తన దూరదృష్టికి నిదర్శనమని చంద్రబాబు వివరించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×