E-Paper
Advertisement

CM Chandrababu Naidu: కష్టపడే కార్యకర్తలకు పట్టం కడతాం.. పని చేయని ఎమ్మెల్యేలకు నమస్కారమే.. నేత‌ల‌కు చంద్రబాబు సీరియస్ వార్నింగ్

CM Chandrababu Naidu: కష్టపడే కార్యకర్తలకు పట్టం కడతాం.. పని చేయని ఎమ్మెల్యేలకు నమస్కారమే.. నేత‌ల‌కు చంద్రబాబు సీరియస్ వార్నింగ్
Advertisement

CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుప్పం పర్యటనలో భాగంగా నియోజకవర్గ కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఈ వేదికపై సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని 150 చెరువులను హంద్రీ-నీవా కృష్ణా జలాలతో నింపినందుకు స్థానిక నేతలు, రైతులు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన సామాన్య కార్యకర్త షణ్ముఖ రెడ్డిని చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని చంద్రబాబు మరోసారి నిరూపించారు.

ఈ స‌మావేశంలో సీఎం మాట్లాడుతూ, గతంలోనూ, ప్రస్తుతం కుప్పంలో తాను ప్రారంభించిన వినూత్న కార్యక్రమాలనే ఆదర్శంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీని గెలిపించే వరకు జెండాను భుజాన మోయడం కార్యకర్తలకు అలవాటని, ఎన్ని సంక్షోభాలు ఎదురైనా పార్టీ బలంగా నిలదొక్కుకోవడానికి కార్యకర్తల నిబద్ధతే కారణమని కొనియాడారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా కూటమికి మరియు టీడీపీకి ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారని, వైసీపీ ప్రతిపక్ష హోదాకు కూడా దరిదాపుల్లో లేకపోవడం ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. 2028 నాటికి తన రాజకీయ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతోందని, విజన్-2020 ద్వారా తాను వేసిన అభివృద్ధి పునాదులు నేడు సాకారం అవుతున్నాయని గుర్తుచేశారు.

Advertisement

కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు, హంద్రీ-నీవా ద్వారా కృష్ణా జలాలను ఒకే సీజన్‌లో కుప్పానికి తీసుకురావడం ఒక చారిత్రక ఘట్టమని అభివర్ణించారు. ఒకవేళ నీళ్లు రాకపోయి ఉంటే నియోజకవర్గంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమను ‘రతనాల సీమ’ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని, ఉద్యాన ఉత్పత్తుల్లో రాయలసీమను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని భరోసా ఇచ్చారు. అలాగే, అమరావతి లాంటి కొత్త నగరాల ఆవశ్యకతను ఆర్థిక సర్వే కూడా స్పష్టం చేసిందని, రాబోయే రోజుల్లో ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.

ఈ స‌మావేశంలో పార్టీ నాయకుల పనితీరుపై చంద్రబాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్యేల పనితీరును తాను ప్రతి వారం విశ్లేషిస్తున్నానని, నిర్మొహమాటంగా వాస్తవాలు చెబుతూ తప్పులు సరిదిద్దుకోమని సూచిస్తానని చెప్పారు. అప్పటికీ మారకపోతే పక్కన పెడతానని హెచ్చరించారు. కార్యకర్తలకు, తనకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండేందుకు పార్టీలోనూ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నప్పుడు కూడా ఇంటింటికీ వెళ్లి కూటమిలోని పార్టీలతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

Read Also: Education Budget 2026: విద్యారంగంలో సంస్కరణలు.. స్కూళ్లల్లో వై-ఫై, అటల్ ల్యాబ్స్.. జిల్లాకో బాలికల హాస్టల్..

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×