E-Paper
Advertisement

CBN : తెలుగు ప్రజలను ఐక్యం చేసే బిజీలో చంద్రబాబు!

CBN : తెలుగు ప్రజలను ఐక్యం చేసే బిజీలో చంద్రబాబు!
Advertisement

ఏపీ సీఎం చంద్రబాబు నాయడు తెలుగు ప్రజలను మరోసారి ఐక్యం చేసే పనిలో నిమగ్నం అయ్యారు. దశాబ్దాల కిందట భాషా ప్రయుక్త రాష్ట్రాలు కలిసి ఉండాలని, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు ప్రజలను ఏకం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పొట్టిశ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన చేసిన త్యాగం అంత సులువుగా మరువలేనిదని పేర్కొన్నారు. అందుకనే ఏపీ రాజధానిలో ఆయన త్యాగానికి గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని తయారుచేయించి సోమవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రారంభించారు.

ఏకమైన రాష్ట్రం, మళ్లీ ముక్కలై..

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కలిసి మెలిసి ఉన్న తెలుగు ప్రజలు ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు. అంతకుముందు సైతం ఇలాగే ఏపీ,తెలంగాణ విడిపోయి ఉన్న రాష్ట్రాలు ఒక్కటిగా కలువడంలో పొట్టి శ్రీరాములు పాత్ర మరువలేనిది. ఆయన ఆమరణ నిరాహార దీక్షకారణంగానే తెలుగు మాట్లాడే ప్రజలు ఒకే గొడుకు కిందకు అనగా ఒకే రాష్ట్రంగా ఏర్పడ్డారు. అయితే, ఉమ్మడి ఏపీ ఏర్పడక ముందే పొట్టి శ్రీరాములు మరణించగా.. అనంతరం జరిగిన ఉద్యమాల కారణంగా కేంద్రం తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్‌గా మార్చింది. ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు, ఉద్యోగాలు, నీళ్లు, నిధుల విషయంలో తేడాలు వచ్చి తిరిగి 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన విషయం తెలిసిందే.

తెలుగు ప్రజల ఐక్యత వర్థిల్లాలి..

Advertisement

రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు మాట్లాడే వారంతా కలిసి మెలిసి అన్మదమ్ముల వలే ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలంతా కలిసి ఉంటేనే బలం అని.. అప్పుడు కేంద్రం వద్ద రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇటీవలి కాలంలో ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు నెలకొన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే భేటీ అయ్యారు. నదీ జలాల వివాదాలపై అటు గోదావరి, ఇటు కృష్ణా ట్రిబ్యునల్‌లో వాదనలు నడుస్తున్నాయి.ఏదైనా తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.

Statue of Sacrifice: పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల భారీ విగ్రహం: సీఎం చంద్రబాబు

Advertisement

రాష్ట్రాల సరిహద్దుల విషయంలోనూ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి తుమ్మల ఇటీవల కీలక ప్రతిపాదన చేశారు. భద్రాచలం పరిధిలోని ఐదు గ్రామాలను తిరిగి వెనక్కి ఇవ్వాలని కోరారు. అందుకు చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఏపీ, తెలంగాణ విడిపోయిన సమయంలో ఏడు మండలాలను కేంద్రం ఏపీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఇవన్నీ పోలవరం ముంపు కిందవెళ్తున్నాయి.అందుకే వాటిని ఏపీలో విలీనం చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. తెలుగు ప్రజలు ఐక్యత కోసం ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని, వాటికి అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే ప్రజల మధ్య ఐక్యత వర్థిల్లుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×