E-Paper
Advertisement

Chandrababu: జగన్ తీసుకొచ్చిన ఆ యాక్ట్.. ప్రజల మెడకు ఉరితాడు: చంద్రబాబు

Chandrababu: జగన్ తీసుకొచ్చిన ఆ యాక్ట్.. ప్రజల మెడకు ఉరితాడు: చంద్రబాబు
Advertisement

Chandrababu: కూటమి హామీలు చూసి జగన్ కు నిద్రపట్టడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క పథకం ఆగదని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగించారు. మంత్రి పెద్దారెడ్డిపై ఈ సందర్భంగా ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల మెడకు ఉరితాడు లాంటిదని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ నేతల భూములు కూడా జగన్ వదలరని అన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓ గర్భిణి మంచి నీళ్లు అడిగిందని తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారకానాథ్ సతీమణి సమక్షంలోనే వైసీపీ నేతలు ఆమెపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

ప్రతిపక్షంపై కేసులు పెట్టే పోలీసులు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుందని మండిపడ్డారు. హుదాతనం అంటే ఏంటో మంత్రి నేర్చుకోవాలని అన్నారు. మంత్రి ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుక్కోవడంతో పాటు పేదల భూములు లాక్కుంటారని ధ్వజమెత్తారు.

Also Read:ఈసీ సంచలన నిర్ణయం.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు

Advertisement

జగన్ ప్రజల ఆస్తులపై కన్నే సారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.  అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ప్రసంగించారు.రైతలకు ఇచ్చే పట్టా భూముల పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు. జగన్ ఐదేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలేదని ఆరోపించారు. ఓట్ల కోసం వైసీపీ నేతలు వస్తే చేసిన అభివృద్ధిపై నిలదీయాలని అన్నారు.

టీడీపీ హయాంలో అనంతపురాన్ని హార్టీ కల్చర్ హబ్ గా మార్చానని చెప్పారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రాయలసీమ కోసం జగన్ ఏమీ చేయలేదని అన్నారు. తాను తీసుకువచ్చిన దీపం పథకాన్ని జగన్ అమలు చేయలేదని చెప్పారు. ఉద్యోగుల కోసం చంద్రబాబు పలు హామీలను ప్రకటించారు. ఉద్యోగల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×