E-Paper
Advertisement

Chandrababu : అయ్యన్నపై రేప్‌ కేసు పెడతారా? ప్రభుత్వ టెర్రరిజం అంటూ చంద్రబాబు ఫైర్

Chandrababu : అయ్యన్నపై రేప్‌ కేసు పెడతారా? ప్రభుత్వ టెర్రరిజం అంటూ చంద్రబాబు ఫైర్
Advertisement

Chandrababu : జలవనరుల శాఖ ఈఈని బెదిరించి అయ్యన్నపై తప్పుడు ఫిర్యాదు చేయించారని.. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

అయ్యన్న పాత్రుడు అరెస్టు వైసీపీ అరాచక పాలనకు పరాకాష్టని.. విశాఖలో భూకబ్జాలపై పోరాడితే అరెస్టు చేస్తారా? అని చంద్రబాబు నిలదీశారు. పోలీసులు తాగి వచ్చారని.. గోడ దూకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చెప్పులు కూడా వేసుకోనీయకుండా అయ్యన్నను లాక్కెళ్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్యపై షర్మిల ఇచ్చిన వాంగ్మూలం, రుషికొండ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే అయ్యన్నను అరెస్టు చేయించారన్నారు చంద్రబాబు.

Advertisement

హత్య చేసిన అవినాష్‌కు అభయం ఇస్తున్నారు.. ఉత్తరాంధ్ర కబ్జాలను ప్రశ్నించిన అయ్యన్నను అరెస్టు చేశారు.. వెనకబడిన వర్గాలపై కక్ష గట్టి పనిచేస్తారా? అని చంద్రబాబు నిలదీశారు. సీఐడీ ఆఫీస్‌ టార్చర్‌ ఆఫీస్‌గా మారిందని మండిపడ్డారు. నలుగురు మాజీ మంత్రులను అక్రమంగా అరెస్టు చేయించారన్నారు. .

అయ్యన్నపై రేప్‌ కేసు పెడతారా? అయ్యన్న కుటుంబంపై 12 కేసులు పెడతారా? కోర్టులు చీవాట్లు పెట్టినా వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిరాలేదని చంద్రబాబు విమర్శించారు. ఇది ప్రభుత్వమే చేస్తున్న టెర్రరిజం అన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×