E-Paper
Advertisement

Chandrababu Cabinet: చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ పోస్టులు 34 శాతం వారికే!

Chandrababu Cabinet: చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ పోస్టులు 34 శాతం వారికే!
Advertisement

Chandrababu Cabinet: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు బీసీ వర్గాల చుట్టూనే తిరుగుతున్నాయి. బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. దీనిపై ఏపీ సర్కార్ కూడా దృష్టి పెట్టింది.

గురువారం అమరావతిలో సమావేశమైన చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామిక వేత్తలను ఆదుకునేలా ప్రభుత్వ పాలసీల్లో మార్పులు చేసింది.

Advertisement

వాటికి కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వర్గాల పారిశ్రామిక వేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా విద్యుత్ సహా పలు విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా వర్గ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది ప్రభుత్వం. ఇంకా కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×