E-Paper
Advertisement

Chandrababu : కూల్చివేతలు మానండి..ఏదైనా నిర్మించి చూడండి: చంద్రబాబు

Chandrababu : కూల్చివేతలు మానండి..ఏదైనా నిర్మించి చూడండి: చంద్రబాబు
Advertisement

Chandrababu : వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేత ఘటనపై ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం దిక్కుమాలిన పనులు చేస్తోందని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్‌ చేసిన తప్పులు 100 దాటిపోయాయని ఆరోపించారు. ఇక ప్రభుత్వ పతనమే మిగిలిందని విమర్శించారు. ఏపీ‌ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు,అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. 600 ఇళ్లు ఉన్న ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రోడ్డు విస్తరిస్తారా? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ అసలు ఏనాడైనా రోడ్లు వేసిందా అని చంద్రబాబు నిలదీశారు. జనసేన అధినేత పవన్‌ పర్యటన అడ్డుకుంటేనో, టీడీపీ నేతల పర్యటన సమయంలో రాళ్లు వేస్తేనో పైచేయి సాధించలేరని హితవు పలికారు. కూల్చడం మాని ఏదైనా నిర్మించి చూడాలన్నారు. అప్పుడు ఆ తృప్తి ఎలా ఉంటుందో తెలుస్తుందని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×