E-Paper
Advertisement

AP Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతే.. కేంద్రం క్లారిటీ..

AP Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతే.. కేంద్రం క్లారిటీ..
Advertisement

AP Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతే అని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. ఏపీ కేపిటల్ పై రాజ్యసభలో కేంద్ర పట్టణాభివృద్ధి సహాయమంత్రి కౌశల్ కుమార్ లిఖిత పూర్వంగా సమాధానం ఇచ్చారు. దేశంలో 28 రాష్ట్రాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని వివరించారు. ఈ బృహత్ ప్రణాళికలకు కేంద్రం ఆమోదం తెలిపిందని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూడా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించామని కౌశల్ కుమార్ తెలిపారు. ఈ బృహత్ ప్రణాళికకు కేంద్రం ఆమోదించిందన్నారు.

Advertisement

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ చేపట్టాలని భావిస్తోంది. కార్యనిర్వహక రాజధానిగా విశాఖను మార్చాలని సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. సీఎంవో కార్యాలయం, ప్రభుత్వ శాఖల ఆఫీసులను విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఈ నెల చివరివారంలో ఈ పిటిషన్ పై తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధానిపై కేంద్రం చేసిన తాజా ప్రకటన ఆసక్తిని రేపుతోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×