E-Paper
Advertisement

Amaravati News: రాజధాని రైతులు ఫుల్‌హ్యాపీ.. ఏపీ రాజధానిగా అమరావతి, కేంద్రం సవరణ బిల్లు!

Amaravati News: రాజధాని రైతులు ఫుల్‌హ్యాపీ.. ఏపీ రాజధానిగా అమరావతి, కేంద్రం సవరణ బిల్లు!
Advertisement

Amaravati News: ఏపీ రాజధాని అమరావతిని అధికారికంగా ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమైందిన దీనికి సంబంధించి సవరణ బిల్లును ఈ సమావేశాల్లో తీసుకురానుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని రాజధానిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే న్యాయశాఖ ఆమోదం లభించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే అమరావతి రాజధాని హోదాకు చట్టబద్ధత ఏర్పడనుంది.

రాజధాని రైతులు ఫుల్‌హ్యాపీ

Advertisement

ఏపీలో ప్రభుత్వం మారితే రాజధాని అమరావతి ఉంటుందా? లేదా? ఈ డౌట్ అమరావతి రైతులకే కాదు, రాష్ట్రవ్యాప్తంగా చాలామందిని వెంటాడింది. దీనిపై కూటమి ప్రభుత్వం పదేపదే చెబుతూ వస్తోంది. అయినా చాలామందికి నమ్మకం కుదరలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో సవరణ బిల్లును తీసుకురావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. విభజన తర్వాత రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించడానికి సవరణలు చేయనుంది. ఆ చట్టంలోని సెక్షన్ 5(2) లో స్పష్టమైన సవరణ చేయాలని భావిస్తోంది. దీని ద్వారా అమరావతి రాజధానిగా మారనుంది.

Advertisement

ఏపీ రాజధానిగా అమరావతి, కేంద్రం సవరణ బిల్లు!

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో కొత్త సవరణకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం లభించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ శాఖ ఆమోదం లభించడంతో చట్టపరంగా ఎలాంటి సమస్యలు ఉండదు. సవరణ బిల్లుని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. ఉభయ సభల ఆమోదం తర్వాత అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ జారీ కాగానే అమరావతి రాజధానిగా చట్టబద్ధమైన హోదా లభించనుంది.

ALSO READ: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. ఈ-డిప్ ద్వారా టోకెన్లు జారీ

ఇదిలాఉండగా మంగళవారం రెండో విడత భూసేకరణ చంద్రబాబు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే సమయంలో వైసీపీ మరోసారి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఏపీకి వచ్చిన పరిశ్రమలను అన్నింటికి విశాఖకు తరలిస్తోందని కొత్త మెలిక పెట్టింది. మంగళవారం మీడియా ముందుకొచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని ఈ విషయాన్ని వెల్లడించారు. అన్ని కంపెనీలు విశాఖకు పోతే అమరావతి ఎందుకని ప్రశ్నించారు. ఈ విషయాన్ని రైతుల వెర్షన్‌గా మనసులోని మాట బయటపెట్టారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×