E-Paper
Advertisement

Jogi Ramesh: జోగి రమేష్‌కు మరిన్ని కష్టాలు.. కుటుంబంపై ఆస్తుల ధ్వంసం కేసు, అర్థరాత్రి ఏం జరిగింది?

Jogi Ramesh: జోగి రమేష్‌కు మరిన్ని కష్టాలు..  కుటుంబంపై ఆస్తుల ధ్వంసం కేసు, అర్థరాత్రి ఏం జరిగింది?
Advertisement

Jogi Ramesh:  ఏదైనా శాంతం వహించాలని పెద్దలు చెబుతారు. ఆవేశానికి వెళ్తే లేనిపోని అనర్థాలు, చిక్కుల్లో పడతాము కూడా. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్. ఆయనతోపాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయడమే అందుకు కారణమని తెలుస్తోంది.

చిక్కుల్లో జోగి రమేష్ ఫ్యామిలీ

Advertisement

సోషల్ మీడియా బలంగా ఉన్న ఈ రోజుల్లో నేతలు జాగ్రత్తగా అడుగులు వేయాలి. తేడా వస్తే ఇమేజ్ డ్యామేజ్ కాదు.. కేసు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వుంటుంది. అఫ్‌కోర్సు అందుకు కారణాలు అనేకం కావచ్చు. లేటెస్టుగా మాజీ మంత్రి జోగి రమేష్ విషయంలో అదే జరిగింది.

ఏపీలో నకిలీ మద్యం కేసులో ఆదివారం ఉదయం ఆయన్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటి నుంచి నేరుగా ఎక్సైజ్ ఆఫీసుకు తరలించారు. విచారణ తర్వాత రాత్రి దాదాపు 12 గంటల సమయంలో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నమోదు

ఆసుపత్రికి అనుచరులతో కలిసి చేరుకున్నారు జోగి రమేష్ భార్య శంకుతల, కొడుకులు రాజీవ్, రోహిత్ లు. అయితే ఆసుపత్రి వద్ద జోగి రమేష్ మద్దతుదారులు, వైసీపీ కార్యకర్తలు నానా హంగామా చేశారు. తమ నేతను అక్రమంగా అరెస్టు చేశారంటూ భారీగా నినాదాలు చేశారు. పోలీసు వాహనం ముందు బైఠాయించారు.

ఆవేశానికి లోనైనా జోగి మద్దతుదారులు ఆసుపత్రి క్యాజువాల్టీ వార్డు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు షాకయ్యారు.  ఈ నేపథ్యంలో పోలీసులు-జోగి రమేశ్‌ అనుచరులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.  చివరకు వైద్య పరీక్షల తర్వాత ఎక్సైజ్‌శాఖ అధికారులు ఆయన్ని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు.

ALSO READ: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. మరో మూడు రోజులు

పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో విజయవాడలోని మాచవరం పోలీస్‌స్టేషన్‌లో జోగి రమేష్ ఫ్యామిలీ, అనుచరులపై కేసు నమోదు చేశారు. మరోవైపు నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేష్ తోపాటు  ఆయన సోదరుడు రాముకు ఈనెల 13 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఒకవేళ ఈ కేసులో ఆయన బయటకు వస్తే, ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్టు చేయడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.  రాజకీయ నేతలు ఓపిగ్గా ఉండాలని చాలామంది చెబుతారు బహుశా అందుకేనేమో!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×