// // Case On Ambati: ముద్రగడ అంత్యక్రియలు.. అంబటిపై కేసు నమోదు -->
E-Paper
Advertisement

ముద్రగడ అంత్యక్రియలు.. అంబటి రాంబాబు దురుసు ప్రవర్తన, కేసు నమోదు చేసిన పోలీసులు

ముద్రగడ అంత్యక్రియలు.. అంబటి రాంబాబు దురుసు ప్రవర్తన, కేసు నమోదు చేసిన పోలీసులు
Advertisement

Case On Ambati: అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతలకు కష్టాలు తీవ్రమవుతున్నాయి. తాము అధికారంలో ఉన్నామనే భ్రమల్లో ఉన్నారు. ఏదో విధంగా క్రెడిట్ తెచ్చుకోవాలనే ఆరాటపడుతున్నారు. ఫలితంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. ఫలితంగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా పద్మనాభం అంత్యక్రియల విషయంలో మాజీ మంత్రి అంబటిరాంబాబుపై కాకినాడ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.

ముద్రగడ అంత్యక్రియల్లో అంబటి దూకుడు-వైసీపీ నేత అంబటి రాంబాబుపై కాకినాడ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ముద్రగడ అంత్యక్రియల్లో పోలీసు సిబ్బంది గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుండగా వారిపై దురుసుగా ప్రవర్తించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. తన మద్దతు దారులతో కలిసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు.

Advertisement

కేసు నమోదు చేసిన కిర్లంపూడి పోలీసులు-ఈ మేరకు ఫిర్యాదులు అందడంతో ఆయనపై కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్న తమను ఉద్దేశపూర్వ కంగా తోసివేశారని అధికారులకు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో అంబటిపై సెక్షన్లు 132, 3(5) అంబటితోపాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

గతంలో కూడా పలు కేసులు నమోదు- ముద్రగడ చివరి కోరికను అమలు చేసామని అంబటి చెబుతూ  పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముద్రగడ అంత్యక్రియల కంటే అంబటి చేసిన వ్యవహారం పెద్ద రచ్చగా మారింది. ముద్రగడ కుటుంబసభ్యులు కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలో అంత్యక్రియలు చేశారు.

Advertisement

అంబటిపై ఈ కేసు ఒక్కటే కాదు. గతంలో వైసీపీ అధినేత జగన్ ఎక్కడకు వెళ్లినా ఆయనతోపాటు అంబటి రాంబాబు వెళ్తున్నారు. ఆ సమయంలో ఆయన దురుసు ప్రవర్తన కారణంగా పలు సందర్భాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఒకానొక దశలో సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజులు ఆయన జైలుకి వెళ్లిన విషయం తెల్సిందే.

ALSO READ: అక్రమ సంబంధం చిచ్చు.. గుడికి తీసుకెళ్లి భర్తను లేపేసిన భార్య, చిత్తూరు జిల్లాలో దారుణం

కిర్లంపూడి పోలీసులు కేసు నమోదుపై అంబటి ఇంకా రియాక్ట్ కాలేదు.  ఈ ఏడాది ఏప్రిల్‌లో తన ఇంటిపై దాడికి నిరసనగా అంబటి రాంబాబు గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్షకు దిగారు. అయితే దీక్షకు ముందస్తు అనుమతి లేకుండా చేపట్టడం, దీనివల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో ఆయనపై కేసు నమోదు చేశారు గుంటూరు పోలీసులు.

గతేడాది జూన్‌లో కూడా పోలీసుల విధులకు ఆయన ఆటంకం కలిగించారు. దీంతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి వైసీపీ అధికారం అంబటిపై కనీసం ఆరు నెలలకు ఒకటి చొప్పున కేసు నమోదు అవుతుందని అంటున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×