E-Paper
Advertisement

ఏపీకి క్యారియర్ ధమాకా.. లోకేష్ స్పీడ్‌కు ఫిదా అయిన అమెరికా దిగ్గజం

ఏపీకి క్యారియర్ ధమాకా.. లోకేష్ స్పీడ్‌కు ఫిదా అయిన అమెరికా దిగ్గజం
Advertisement

Carrier AC plant: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్ కండిషనర్ల తయారీ సంస్థ క్యారియర్ తన నూతన ప్లాంట్‌కు శ్రీకారం చుట్టింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టుకు ఘనంగా శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా.. స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ అడుగు పడినట్లు కనిపిస్తోంది.

అమెరికాకు చెందిన ఈ దిగ్గజ సంస్థ దాదాపు రూ. 1000 కోట్ల భారీ పెట్టుబడితో ఇక్కడ తన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. శ్రీసిటీలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమ రూపు దిద్దుకోనుంది. ముఖ్యంగా గృహేతర అవసరాలకు ఉపయోగపడే భారీ స్థాయి ఏసీల తయారీపై ఈ సంస్థ దృష్టి సారించింది. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదలవుతాయి.

Advertisement

ఈ ప్రాజెక్ట్ వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం ఉపాధి కల్పన. సుమారు 3000 మందికి ఈ పరిశ్రమ ద్వారా పని లభిస్తుందని అంచనా. ఇందులో 1000 మందికి నేరుగా, మరో 2000 మందికి అనుబంధ రంగాల ద్వారా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగు పరిచేందుకు.. కొత్త కంపెనీలకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఈ క్యారియర్ పరిశ్రమ రాక ఒక నిదర్శనమని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో శ్రీనిటీ మరిన్ని అంతర్జాతీయ సంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా మారే అవకాశం ఉంది.

Also Read:  ఇరాన్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×