E-Paper
Advertisement

Amaravathi : సీఎం పర్యటన.. రాజధాని రైతుల నిరసన.. అమరావతిలో హైటెన్షన్..

Amaravathi : సీఎం పర్యటన.. రాజధాని రైతుల నిరసన.. అమరావతిలో హైటెన్షన్..
Advertisement

Amaravathi : ఆర్‌-5 జోన్‌ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో సీఎం జగన్‌ పట్టాల పంపిణీ నేపథ్యంలో.. రైతులు నిరసన బాటపట్టారు. రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి, మందడం, కృష్ణాయపాలె గ్రామాల్లో ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు ఆందోళన చేపట్టారు.

వెలగపూడిలోని దీక్షా శిబిరం వద్ద రైతులు నల్లబెలూన్లు, నల్ల జెండాలు ఎగురవేశారు. సీఎం జగన్‌ మొండి వైఖరి నశించాలని నినదిస్తున్నారు. అమరావతిని విచ్ఛిన్నం చేసే సీఎం గో బ్యాక్‌ , అమరావతిని నిర్మించండి.. ఆంధ్రప్రదేశ్‌ కాపాడండి అంటూ ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు.

Advertisement

మందడంలోని దీక్షా శిబిరం వద్ద నుంచి నిరసనకారులు బయటకు రాకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో 3 వేల మంది పోలీసులను మోహరించారు. అమరావతి రైతుల ఆందోళనపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. అమరావతి జేఏసీ నేతలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ముందుస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు.

సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది మహిళలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తుంది. గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మందిని, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన 27,031 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ పరిధిలోని 1,402 ఎకరాల్లో 25 లేఔట్లు ఏర్పాటు చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు, సీఆర్డీఏ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో గృహాలనూ లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×