E-Paper
Advertisement

Tirumala : తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. పిట్టగోడను ఢీకొట్టి ఆగిపోయిన బస్సు.. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం

Tirumala : తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. పిట్టగోడను ఢీకొట్టి ఆగిపోయిన బస్సు.. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం
Advertisement

Tirumala Accident : తిరుమల తిరుపతిలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే తొక్కిసలాట ఘటన జరగగా.. ఇప్పుడు ఘాట్ రోడ్డులో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది గాయపడినట్లు సమాచారం. కాగా.. తిరుమల ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి వెళుతున్న బస్సు.. సోమవారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని సమాచారం.

పైకి వెళ్లేటప్పుడు సహజంగానే వాహనాలు వేగంగా వెళుతుంటాయి. అలా రెండో ఘాటు రోడ్డు ద్వారా పైకెళ్తున్న ఆర్టీసీ బస్సు.. మలుపు చివరన ఉండే పిట్టగోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన సమయంలో  బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇందులో.. 10 మందికి గాయాలు అయ్యినట్లు తెలుస్తోంది.

Advertisement

ప్రమాద వివరాలు తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని రక్షించి, దగ్గర్లోని ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించారు. అక్కడ వారికి ప్రథమ చికిత్స అందించి, స్విమ్స్ కు తరలించారు. పైకి వెళ్లే మార్గంలోని మలుపులో ప్రమాదం జరగడంతో.. వెనుక వస్తున్న వాహనాలతో దాదాపు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దాంతో.. కొండ పైకి వెళ్లే మార్గంలో తీవ్ర ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ తొలగించే పనుల్లో బిజీగా ఉన్నారు. కాగా.. ఈ ప్రమాదానికి కారణాలపై ఆర్టీసీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×