E-Paper
Advertisement

Bridge : ఇచ్ఛాపురంలో కుప్పకూలిన వంతెన.. ప్రమాదం ఎలా జరిగిందంటే..?

Bridge : ఇచ్ఛాపురంలో కుప్పకూలిన వంతెన.. ప్రమాదం ఎలా జరిగిందంటే..?
Advertisement

Bridge : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బాహుదా నదిపై ఉన్న పురాతన వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రానైట్‌ రాళ్ల లోడుతో లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాలోని అస్కా నుంచి ఒంగోలుకు 70 టన్నుల గ్రానైట్‌ రాళ్ల లోడుతో లారీ వెళుతోంది. సాధారణంగా భారీ బరువుతో వచ్చే వాహనాలు పక్కనే ఉన్న జాతీయ రహదారి పైనుంచి వెళ్తుంటాయి. కానీ గ్రానైట్‌ లోడుతో వెళ్తున్న లారీ మాత్రం ఇచ్ఛాపురం మీదుగా వచ్చింది.

వంతెనపైకి లారీ చేరుకోగానే ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో లారీ కిందికి నదిలోకి జారిపోయింది. నదిలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదే విధంగా ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపైకి ఇతర వాహనాలు రాలేదు. దీంతో ప్రాణనష్టం జరగలేదు.

Advertisement

బహుదానదిపై బ్రిడ్జి కూలిపోవడంతో నేరుగా ఇచ్ఛాపురంలోకి వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయంగా పోలీసులు జాతీయ రహదారి వైపు నుంచి బస్సులు, ఇతర వాహనాలను మళ్లిస్తున్నారు.
బాహుదా నదిపై ఈ వంతెనను 1929లో బ్రిటీష్‌ పాలకులు నిర్మించారు. చాలాకాలంగా బ్రిడ్జి బలహీనంగా మారింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×