E-Paper
Advertisement

Brahmamgari Matham: కొలిక్కివచ్చిన వివాదం.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

Brahmamgari Matham: కొలిక్కివచ్చిన వివాదం.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి
Advertisement

Brahmamgari Matham: కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామిని ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ , ప్రభుత్వం నియమించింది. ఎన్నో వివాదాల అనంతరం 12వ పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిగా నియమించడంతో మఠంలో భక్తుల సంబరాలు చేసుకుంటున్నారు. గత నాలుగేళ్లుగా పీఠాధిపతి పదవి కోసం వివాదం నెలకొంది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంతరాయ మొదటి భార్య, రెండో భార్య కుమారుల మధ్య నాలుగేళ్లుగా ఈ వివాదం సాగింది. చివరికి మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠం పీఠాధిపతిగా ధార్మిక పరిషత్ నిర్ణయించింది.

2021 నుంచి వివాదం

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వ్యవహారంపై నాలుగేళ్లుగా వివాదం కొనసాగింది. 2021 మే 8న బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి అనారోగ్యంతో శివైక్యం చెందారు. అనంతరం నొస్సం వెంకటాద్రిస్వామి పీఠాధిపతిగా, ఉత్తరాధికారిగా వీరభద్రస్వామి, వీరి తర్వాత నొస్సం గోవిందస్వామికి అవకాశం ఇచ్చేలా నిర్ణయించారు. అయితే వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి మొదటి, రెండో భార్య కుమారుల మధ్య పీఠాధిపత్యానికి కోసం పోటీ మొదలైంది.

హైకోర్టులో పిటిషన్

Advertisement

అప్పట్లో ఈ వ్యవహారంపై దేవాదాయశాఖ మంత్రి కూడా జోక్యంచేసుకుని కుటుంబ సభ్యులతో చర్చించారు. అయినా వ్యవహారం తేలలేదు. అయితే అప్పటి ఎమ్మెల్యే వీరభోగవసంత వేంకటేశ్వరస్వామి మొదటి, రెండో భార్య కుమారులతో చర్చించారు. సమస్య పరిష్కారం అయిందనుకున్న సమయంలో పూర్వ పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు కొట్టివేసింది. తాజాగా ఈ వివాదం కొలిక్కి వచ్చింది. బ్రహ్మం గారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామిని ధార్మిక పరిషత్ నిర్ణయించింది.
Also Read: ఏపీ సర్కార్ సంక్రాంతి కానుక.. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు క్లియర్

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×