E-Paper
Advertisement

Boy : టవల్ తోనే పోలీస్ స్టేషన్ కు బాలుడు.. సవతి తల్లిపై ఫిర్యాదు.. ఎందుకంటే..?

Boy : టవల్ తోనే పోలీస్ స్టేషన్ కు బాలుడు.. సవతి తల్లిపై ఫిర్యాదు.. ఎందుకంటే..?
Advertisement

Boy : కట్టుకున్న టవల్ తోనే కోపంగా ఇంటి నుంచి బయటకు వచ్చాడు ఆ బాలుడు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. సవతి తల్లిపై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. అసలు ఏం జరిగిందంటే..?

ఏలూరు కొత్తపేటకు చెందిన సాయి దినేష్‌కు పదేళ్లు. తల్లి రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి మరో పెళ్లి చేసుకున్నారు. సాయి దినేష్‌కు ఓ సోదరి కూడా ఉంది. ఆదివారం సాయి దినేష్‌ స్నానం చేసి సవతి తల్లిని తెల్ల చొక్కా ఇవ్వమని అడిగాడు. స్నేహితుడి పుట్టినరోజుకు వెళ్లాలని తెలిపాడు. అందుకు ఆమె నిరాకరించింది. బయటకు వెళ్లొద్దని గట్టిగా చెప్పింది. మారాం చేస్తుంటే కొట్టింది. దీంతో దినేష్‌ చొక్కా వేసుకోకుండానే టూటౌన్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చి సవతితల్లిపై ఫిర్యాదు చేశాడు.

Advertisement

సీఐ చంద్రశేఖరరావు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తల్లిదండ్రుల మాట వినాలని, చక్కగా చదువుకోవాలని బాలుడికి సూచించారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు ఆ బాలుడిని అప్పగించారు.

గతేడాది అల్లరి చేశాడని సాయి దినేష్‌కు సవతి తల్లి వాతలు పెట్టిందని అప్పట్లో స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆమెపై టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×