E-Paper
Advertisement

Botsa on Pawan Kalyan: హమ్మయ్య.. పవన్ నా కోరిక తీర్చారు.. మాజీ మంత్రి బొత్స ఆనందం

Botsa on Pawan Kalyan: హమ్మయ్య.. పవన్ నా కోరిక తీర్చారు.. మాజీ మంత్రి బొత్స ఆనందం
Advertisement

Botsa on Pawan Kalyan: గబ్బర్ సింగ్ – 1 చూశాను. అదే సినిమా పార్ట్ – 2 కూడా చూశాను. కానీ పార్ట్ – 3 రిలీజ్ కాలేదని భాదపడుతున్నాను. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుణ్యమా అంటూ మొన్న కాకినాడలో చూశానని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇటీవల కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన సినిమాటిక్ గా ఉందని బొత్స తెలిపారు.

ఇటీవల కాకినాడ పోర్టును పవన్ కళ్యాణ్ సందర్శించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో సీజ్ దిస్ షిప్ అంటూ పవన్ అన్న వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. అలాగే కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమ రేషన్ రవాణా సాగుతున్న విషయం పవన్ పర్యటనతో దేశవ్యాప్త చర్చకు దారితీసింది. అలాగే కేంద్రం కూడా పోర్టు గురించి పూర్తి స్థాయిలో ఆరా తీస్తుందట. ఇది ఇలా ఉంటే తాజాగా మాజీ మంత్రి బొత్స కాకినాడ పోర్టు గురించి కీలక కామెంట్స్ చేశారు.

Advertisement

బొత్స మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఒకవైపు అప్పులు చేస్తూనే.. మరోవైపు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం ధర్మమేనా అంటూ ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లు కరెంట్ ఛార్జీలు పెంచమని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రూ.15 వేల కోట్లు ప్రజలపై భారం మోపడం తగదన్నారు. ఇది మీకు తగునా సీఎం చంద్రబాబు గారూ అంటూ బొత్స ప్రశ్నించారు.

Also Read: KCR – Jagan: పొంగల్‌కు పొలిటికల్ బొమ్మ.. అజ్ఞాతం నుంచి అమాంతంగా జనాల్లోకి కేసీఆర్, జగన్

Advertisement

ఇక కాకినాడ పోర్టుపై మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ పార్ట్ – 3 రాలేదని అనుకొనేవాడినని, మొన్న పవన్ స్వయంగా పోర్టులో ఆ సినిమా చూపించారని సెటైర్స్ వేశారు బొత్స. అలాగే పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగించడం ముమ్మాటికి తప్పేనని, మరీ అసలు దోషులను ఎప్పుడు ప్రకటిస్తారన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతుందంటే, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విఫలమైనట్లేనని, ఈ విషయంపై జనసేన ఏవిధంగా సమాధానం ఇస్తుందన్నారు.

మరోవైపు సచివాలయంలో మంత్రులు నాదెండ్ల మనోహర్‌, అచ్చెన్నాయుడులు రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా అరికట్టడంపై చర్చ సాగగా, ఏపీలో పోర్టుల నుంచి పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×