E-Paper
Advertisement

టీడీపీ విచారణ కమిటీ ముందు బొండా ఉమా క్లారిటీ.. ఎమన్నారంటే!

టీడీపీ విచారణ కమిటీ ముందు బొండా ఉమా క్లారిటీ.. ఎమన్నారంటే!
Advertisement

Bonda Uma: టీడీపీ కార్యాలయంలో విచారణ ముగిసిన తర్వాత మీడియాతో బొండా ఉమా మాట్లాడారు. 25 ఏళ్లుగా టీడీపీలో ఉన్నా.. పార్టీ లైన్ ఎప్పుడూ దాటలేదని అన్నారు. చంద్రబాబు ఆదేశాలను ధిక్కరించే ప్రశ్నే లేదని, 2019-24 మధ్య ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేశానని గుర్తు చేశారు. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు నివాళులర్పించేందుకే వెళ్లానని, ఉదయం వెళ్లి సభ ముగిసిన వెంటనే తిరిగి వచ్చేశానిని అన్నారు.

నా మాటలు వక్రీకరించారు..

అక్కి నన్ను అంబటి రాంబాబు వచ్చి పలకరించారు. అందరి ముందే మాట్లాడుకున్నామని, అది రహస్యంగా జరిగిన సమావేశం కాదని క్లారిటీ ఇచ్చారు. సంస్మరణ సభకు అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారని, నా వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వక్రీకరించారని వాపోయారు. కొన్ని దుష్టశక్తులు కావాలనే తప్పుడు ప్రచారం చేశాయని ఫైర్ అయ్యారు. పార్టీకి నష్టం జరిగిందా అనే అంశంపైనే వివరణ కోరారు. పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడికి పూర్తి వివరణ ఇచ్చానని తెలిపారు.

Advertisement

Also Read: రామాలయ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ!

వైసీపీ సోషల్ మీడియా.. 

చంద్రబాబు ఆదేశాల మేరకే కమిటీతో సమావేశమయ్యామని, జరిగిన విషయాలన్నీ కమిటీకి వివరించానని తెలిపారు. కోఆర్డినేషన్ లోపం తప్ప మరో తప్పు జరగలేదని, పార్టీ లైన్ దాటలేదని కమిటీకి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని తెలిపారు. పార్టీ సూచనలను పూర్తిగా పాటిస్తామని, వైసీపీ సోషల్ మీడియా కావాలనే నాపై అసత్య ప్రచారం చేసిందని అన్నారు.

సీఎంని కలుస్తాను..

Advertisement

నేను మాట్లాడని మాటలను కూడా నా పేరుతో ప్రచారం చేశారని, ఆ స్టేట్‌మెంట్లు ఎక్కడ ఇచ్చానో వీడియో చూపించండని సీరియస్ అయ్యారు. నేను మాట్లాడిన ప్రతి మాట కెమెరాల్లో రికార్డు అయింది. తప్పు మాట్లాడితే విమర్శించండి కానీ మాట్లాడనిది ఆపాదించొద్దని ఫైర్ అయ్యారు. తప్పుడు ప్రచారమే పార్టీలో అపోహలకు కారణమైందని, పార్టీ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానన్నారు. టీడీపీపై నా నిబద్ధత ఎప్పటికీ మారదని, చంద్రబాబు నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందిన స్ఫష్ట్రం చేశారు. రెండు రోజుల్లో సీఎం చంద్రబాబు లోకేష్ ను కలుసి పూర్తి వివరాలు ఆయనకు వెల్లడిస్తాని ఆయన చెప్పారు.

Also Read: ఇది కదా కావాల్సింది.. సింగిల్ ఛార్జ్‌తో 47 గంటల మ్యూజిక్, Vivo T5e ధర ఎంతంటే?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×