E-Paper
Advertisement

Vidadala Rajini : మంత్రి విడదల రజనికి షాక్.. ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ నేతలు..

Vidadala Rajini : మంత్రి విడదల రజనికి షాక్.. ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ నేతలు..
Advertisement

Vidadala Rajini : ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనికి షాక్‌ తగిలింది. గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని కూడా హాజరయ్యారు. అయితే వేదికపై ఆమె ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ నేతలు అడ్డుతగిలారు.

కేంద్రం నిధులతో కార్యక్రమాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్పుకుంటున్నారేంటంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ పేరు చెప్పకపోవడంతో బీజేపీ నేతలు ఆగ్రహించారు. ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్నారు. బీజేపీ నేతల రియాక్షన్‌తో షాకైన మంత్రి రజని.. తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. తిరిగి వేదికపై తన సీటులో కూర్చున్నారు. ఈ సమయంలో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తమ ఆవేదనను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో బీజేపీ నేతలను కేంద్రమంత్రి మన్సుఖ్‌ మాండవీయ వారించారు.

Advertisement

అదేసమయంలో ఏపీ ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు కల్పించుకున్నారు. ఈ అభ్యంతరాలను కేంద్రమంత్రికి చెప్పానంటూ బీజేపీ నేతలకు సర్దిచెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×