E-Paper
Advertisement

Jagan: జగన్‌పై ఎదురుదాడి, ఇక దూరం పెట్టినట్టేనా?

Jagan: జగన్‌పై ఎదురుదాడి, ఇక దూరం పెట్టినట్టేనా?
Advertisement

Jagan: బీజేపీతో జగన్ చేస్తున్న అంతర్గత చర్చలు ఎంతవరకు వచ్చాయి? అధినేతతో మాట్లాడటానికి బీజేపీ ససేమిరా అంటోందా? వైసీపీని దూరం పెట్టాలని డిసైడ్ అయ్యందా? ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిస్తున్నాయి. అసలేం జరిగింది?

ఏపీలో అధికారం పోయిన తర్వాత బీజేపీకి దగ్గరయ్యేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు మాజీ సీఎం జగన్. బెంగుళూరు వేదికగా అక్కడి నేతల ద్వారా తనవంతు ప్రయత్నాలు చేశారు.  ఈ విషయంలో బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో జగన్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. దాని ద్వారా బల ప్రదర్శన చేశారు.

Advertisement

జగన్‌కు మద్దతుగా ఉండే ఏపీలో కొందరు బీజేపీ నేతలు హైకమాండ్‌కి దృష్టికి పంపించినట్టు సమాచారం. ఎన్నికల్లో ఓడినా, మాజీ సీఎంకు ప్రజల్లో ఆదరణ ఉందన్నది అందులోని సారాంశం. ఈ విషయం లో కమలనాధుల నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చేయో తెలీదు. మంత్రి సత్యకుమార్ ఎదురుదాడి చూసి షాకయ్యారు వైసీపీ నేతలు.

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలకు కౌంటరిస్తున్నారు టీడీపీ-జనసేన నేతలు. కానీ బీజేపీ నుంచి ఎలాంటి కౌంటర్లు పడలేదు. హైకమాండ్ సంకేతాలు ఏమో తెలీదుగానీ మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్య కుంభకోణం సూత్రధారి జగన్ అరెస్టు కానున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ALSO READ: కాఫీ గిన్నెకు భయపడి ఇద్దరు బాలికలు సూసైడ్, ఏం జరిగిందంటే

అంతేకాదు కూటమి ఏడాది పాలనపై ‘సాక్షి’ చర్చకు సిద్ధమేనంటూ ఎటాకింగ్ మొదలుపెట్టారు. ఉన్నట్లుండి మంత్రి సత్యకుమార్ కామెంట్స్‌పై వైసీపీలో అప్పుడే చర్చ మొదలైంది.  మంత్రి మాటల వెనుక బీజేపీ హైకమాండ్ ఉండవచ్చని అంటున్నారు. అందువల్లే నేరుగా లిక్కర్ స్కామ్‌లో జగన్ అరెస్టు కావడం ఖాయమని ఓపెన్‌గా చెప్పారని అంటున్నారు.

మంత్రి సత్యకుమార్ గురించి చెప్పనక్కర్లేదు. హోంమంత్రి అమిత్ షాకు సత్యకుమార్‌ నమ్మినబంటుగా చెబుతారు ఆ పార్టీ నేతలు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆఫ్ ద రికార్డులో చెబుతుంటారు.  అందువల్లే మొన్నటి ఎన్నికల్లో ఆయన ధర్మవరం నుంచి గెలవడం, ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి కావడం చకచకా జరిగిపోయిందని అంటున్నారు.

దీనికితోడు లిక్కర్ కేసు వ్యవహారం వైసీపీని కకావికలం చేసింది. దాని మూలాలు ఏకంగా అధినేత మెడకు చుట్టుకున్నాయి. జరిగిన.. జరుగుతున్న పరిణామాలను గమనించిన బీజేపీ పెద్దలు మంత్రి సత్యకుమార్ ద్వారా ఎదురుదాడికి దిగేలా చేశాయని అనుకుంటున్నారు వైసీపీ నేతలు. ఈ లెక్కన వైసీపీకి కమలం నుంచి కష్టాలు తప్పవని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో చూడాలి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×