E-Paper
Advertisement

Big TV Effect: తిరుమలలో అన్యమత ప్రచారంపై బిగ్ టీవీ-స్వేచ్ఛ కథనం.. రంగంలోకి దిగిన అధికారులు.. చివరకు?

Big TV Effect: తిరుమలలో అన్యమత ప్రచారంపై బిగ్ టీవీ-స్వేచ్ఛ కథనం.. రంగంలోకి దిగిన అధికారులు.. చివరకు?
Advertisement

ఆ పాపం అటవీశాఖదే!

⦿ తిరుమలలో అన్యమత ప్రచారంపై స్వేచ్ఛ-బిగ్ టీవీ కథనం
⦿ రంగంలోకి దిగిన ఫారెస్ట్, పోలీసు, టీటీడీ విజిలెన్స్
⦿ అనుమతికి మించి దుకాణాలు ఉన్నట్లు గుర్తింపు
⦿ ఇదంతా ఫారెస్ట్ సిబ్బంది దందానే అని తేలిన వైనం
⦿ ఇంతవరకూ స్పందించని అటవీశాఖ అధికారులు

Advertisement

తిరుమల, స్వేచ్ఛ:
Big TV Effect: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్యమత ప్రచారం జరిగిందని ‘స్వేచ్ఛ-బిగ్ టీవీ’ ప్రచురించిన ప్రత్యేక కథనం పెను సంచలనమైంది. పాపవినాశనం ప్రాంతంలోని దుకాణదారుల అన్యమత ప్రార్థనలపై వచ్చిన కథనానికి టీటీడీ స్పందించింది. వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్ట్, పోలీసు, టీటీడీ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా దుకాణాలలో తనిఖీలు చేశారు.

ఈ సోదాల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అనుమతికి మించి దుకాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 52 దుకాణాలకు మాత్రమే అనుమతి ఉండగా 120 దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. గత ఐదేళ్లు అడ్డగొలుగా దుకాణాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తేల్చారు. ఆఖరికి రెడ్‌జోన్‌లో కూడా దుకాణాలకు అనుమతులు ఇచ్చినట్లు గుర్తించామని అధికారులు చెబుతున్నారు. ఇదంతా ఫారెస్ట్ సిబ్బంది దందానే అని నిగ్గు తేలింది. దుకాణానికి రూ. 3 వేలు రెంట్ కాగా, ప్రతి దుకాణం నుంచి అటవీశాఖ సిబ్బంది మామూళ్లు రూపంలో రూ.1500 వసూలు చేసింది.

Advertisement

Also Read: TTD Key Decisions: అన్యమత ఉద్యోగులు ఇక ఇంటికే.. కీలక నిర్ణయాలతో.. షాకిచ్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

మాకేం తెలియదు!
మరోవైపు అన్యమత ప్రచారం, అనుమతి లేని దుకాణాలు, రెడ్ జోన్ దుకాణాల వ్యవహారంపై అటవీశాఖ ఇంతవరకూ స్పందించలేదు. తమ సిబ్బంది లేదని అటవీశాఖ ఉన్నతాధికారులు చెబుతూ తిన్నగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై లోతుగా విచారణ చేపడుతామని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషిద్ధం. అయితే పాపవినాశనం దగ్గర ఓ మతానికి చెందిన కొంతమంది, తమ మతం గురించి ప్రచారం చేశారనే వదంతులు వ్యాపించాయి.

మొత్తం 20 మందికి పైగా పాపవినాశనం దగ్గర పాటలతో రీల్స్ చేసినట్లుగా ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ అన్యమత ప్రచారం చేయడంలో అటవీశాఖ అధికారులు సహకారం ఉందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో ఈ విషయంలో వాస్తవాలు నిగ్గు తేల్చడానికి టీటీడీ విజిలెన్స్ యాక్షన్‌లోకి దిగింది. తిరుమల పరిసర ప్రాంతాలలో అన్యమత ప్రచారం నిషేధమైనప్పటికీ ఇలాంటి పనులు సర్వసాధారణంగా మారాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×