E-Paper
Advertisement

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్.. క్రికెట్ బెట్టింగ్‌లో ప్రధాన అనుచరుడు అరెస్ట్

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్.. క్రికెట్ బెట్టింగ్‌లో ప్రధాన అనుచరుడు అరెస్ట్
Advertisement

Kodali Nani: గడిచిన కొంతకాలంగా గుడివాడ పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌ల నెట్‌వర్క్‌పై పోలీసులు కొరడా ఝులిపించారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కూనసాని వినోద్‌ను గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ అండదండలతో వినోద్ గత కొంతకాలంగా ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.

పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గుడివాడ వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బృందం దాడులు నిర్వహించింది. పట్టణంలో కొంతకాలంగా వినోద్ ఆన్‌లైన్ వేదికగా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తూ.. పెద్ద ఎత్తున యువతను ఈ వ్యసనంలోకి లాగుతున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి రూ. 50 వేల నగదుతో పాటు, బెట్టింగ్‌ల కోసం ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

అరెస్ట్ అయిన కూనసాని వినోద్, మాజీ మంత్రి కొడాలి నానికి అత్యంత సన్నిహితుడని స్థానికంగా ప్రచారం ఉంది. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఇన్నాళ్లుగా ఈ అక్రమ వ్యాపారాన్ని సాగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వినోద్ వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉంది? ఈ బెట్టింగ్ రాకెట్‌లో భాగస్వాములు ఎవరు? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం నగదు మాత్రమే కాకుండా, డిజిటల్ లావాదేవీల ద్వారా కూడా భారీ మొత్తంలో సొమ్ము చేతులు మారినట్లు ప్రాథమిక సమాచారం.

కేసు నమోదు చేసిన అనంతరం గుడివాడ వన్ టౌన్ పోలీసులు నిందితుడు వినోద్‌ను కోర్టుకు తరలించారు. అక్రమ బెట్టింగ్‌లు, జూదం వంటి కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా పోలీసు అధికారులు హెచ్చరించారు. గుడివాడలో బెట్టింగ్ మూలాలను పూర్తిగా పెకిలించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ అరెస్టుతో గుడివాడలోని బెట్టింగ్ ముఠాల్లో కలకలం రేగింది.

Advertisement

ALSO READ: Top 20 News: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు, డ్వాక్రా సంఘాల ఉద్యోగుల భారీ మోసం

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×