E-Paper
Advertisement

Bhimavaram DSP: భీమవరానికి కొత్త డీఎస్పీ.. పవన్ కు కోపం తెప్పించిన అధికారి బదిలీ

Bhimavaram DSP: భీమవరానికి కొత్త డీఎస్పీ.. పవన్ కు కోపం తెప్పించిన అధికారి బదిలీ
Advertisement

Bhimavaram DSP: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆగ్రహం తెప్పిన భీమవరం డీఎస్పీ జయసూర్యపై వేటు పడింది. డీఎస్పీ జయసూర్యను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బదిలీ చేశారు. జయసూర్యను డీజీపీ ఆఫీస్ లో రిపోర్టు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఆయన స్థానంలో కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణును నియమించారు. జయసూర్యపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అక్టోబర్ లో డీజీపీకి లేఖ రాయడం సంచలనం అయింది. డీఎస్పీ జయసూర్య పేకాట నిర్వహణకు సహకరిస్తున్నారని ఈ లేఖలో పవన్ పేర్కొన్నారు. అయితే డీఎస్పీ జయసూర్య మంచి అధికారంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ మద్దతు తెలపడం వివాదాస్పదం అయింది.

అసలేం జరిగిందంటే?

భీమవరం డీఎస్పీ జయసూర్య పరిధిలో జూద శిబిరాలు పెరిగాయని ఇటీవల ఫిర్యాదులు పెరిగాయి. అలాగే ఆయన సివిల్‌ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇటీవల స్పందించారు. డీఎస్పీ వ్యవహారశైలిపై డీజీపీ, హోంమంత్రిని నివేదిక కోరారు. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీతోనూ పవన్ కల్యాణ్ అప్పట్లో మాట్లాడారు. పేకాట క్లబ్బుల నిర్వహణపై ఫిర్యాదు వస్తున్నాయని, కొందరు పెద్దలు పేకాట కేంద్రాలను నిర్వహిస్తూ, నెలవారీ మామూళ్లను అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయని పవన్ అన్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు, పోలీసు అధికారులకు దీనిపై ఉన్న సమాచారం కోసం అప్పట్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ఒకవేళ పోలీసు అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు, దానిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో తెలియజేయాలన్నారు.

Also Read: YS jagan : జగన్ నాయకుడా.. ప్రతినాయకుడా?

రఘురామ మద్దతు

Advertisement

అయితే అప్పట్లో భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ.. తనకున్న సమాచారం మేరకు డీఎస్పీకి మంచి ట్రాక్‌ రికార్డు ఉందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో జూద శిబిరాలపై పోలీసులు గట్టి నిఘా ఉందంటూ కితాబిచ్చారు. అందుకే డీఎస్పీపై ఉద్దేశపూర్వక అభియోగాలు వస్తున్నట్లు చెప్పారు. జూద శిబిరాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. పవన్ కల్యాణ్ తన శాఖలతో పాటు పక్క శాఖలను పట్టించుకోవడం హర్షణీయం అన్నారు. రఘురామ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. ఆ తర్వాత తన ఉద్దేశం అది కాదంటూ వివరణ ఇచ్చారు.

డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఆరోపణలపై శాఖాపరమైన విచారణ చేపట్టారు. తాజాగా డీఎస్పీని బదిలీ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×